Tamannaah Bhatia: తమన్నా బాయ్‌ఫ్రెండ్‌ బ్యాగ్రౌండ్‌ తెలిస్తే షాకవ్వాల్సిందే..!

తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ పరిచయం ఉన్న ఈ విజయ్‌ వర్మకు, తమన్నాకు అసలు లవ్‌ ఎక్కడ స్టార్ట్‌ అయ్యిందన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్‌ వర్మ తెలుగువాడేనా అంటూ వెతికేస్తున్నారు. చాలా మంది విజయ్‌ వర్మ నార్త్‌ ఇండియన్‌ అనుకుంటున్నారు.

  • Written By:
  • Publish Date - June 15, 2023 / 03:08 PM IST

Tamannaah Bhatia: మిల్కీ బ్యూటీ తమన్నా తాను విజయ్‌ వర్మతో రిలేషన్‌లో ఉన్నట్టు అఫీషియల్‌గా ఎనౌన్స్‌ చేసింది. పేరు చివర వర్మ అని ఉండటంతో అంతా అతని గురించి ఇంటర్నెట్‌లో వెతకడం ప్రారంభించారు. తెలుగు ప్రేక్షకులకు చాలా తక్కువ పరిచయం ఉన్న ఈ విజయ్‌ వర్మకు, తమన్నాకు అసలు లవ్‌ ఎక్కడ స్టార్ట్‌ అయ్యిందన్నది ఆసక్తికరంగా మారింది. విజయ్‌ వర్మ తెలుగువాడేనా అంటూ వెతికేస్తున్నారు. చాలా మంది విజయ్‌ వర్మ నార్త్‌ ఇండియన్‌ అనుకుంటున్నారు.

కానీ విజయ్‌ వర్మ పక్కా హైదరాబాదీ. ఇదే హైదరాబాద్‌ గల్లీల్లో తిరిగి, పెరిగిన కుర్రాడు. తెలుగుతో పాటు హైదరాబాద్‌ హిందీ కూడా అనర్గళంగా మాట్లాడేస్తాడు. విజయ్‌ వర్మ తన డిగ్రీ వరకూ హైదరాబాద్‌లో చదువుకున్నాడు. కానీ ఆ తరువాత పుణెకు షిఫ్ట్‌ అయ్యాడు. సినిమాల మీద ఇంట్రెస్ట్‌తో పుణె ఫిల్మ్ ఇనిస్ట్యూట్‌లో సీటు సంపాదించి యాక్టింగ్‌లో గ్రాడ్యూయేషన్ పేర్తి చేశాడు. ఆ తరువాత కొన్ని రోజులు హైదరాబాద్‌లోనే థియేటర్ ఆర్టిస్టుగా పని చేశాడు. ఆ టైంలోనే.. అంటే 2008లో షోర్ అనే షార్ట్ ఫిల్మ్‌తో తన యాక్టింగ్ కెరీర్‌ను విజయ్‌ వర్మ స్టార్ట్ చేశాడు. ఆ తరువాత పలు హిందీ సినిమాల్లో యాక్ట్ చేసినప్పటికీ.. అమితాబ్‌, తాప్సీ కలిసి చేసిన సూపర్ హిట్ మూవీ పింక్ సినిమాతో యాక్టర్‌గా మంచి గుర్తింపు సంపాదించాడు.

ఆ సినిమాలో విజయ్‌ చేసిన యాక్టింగ్ కారణంగానే తెలుగులో నాని హీరోగా వచ్చిన ఎంసీయే సినిమాలో విలన్‌ ఆఫర్ దక్కించుకున్నాడు. ఎంసీయే సినిమాలో నాని పెర్ఫార్మెన్స్‌కు తెలుగు ఆడియన్స్‌ ఫిదా అయ్యారు. అప్పటి నుంచి విజయ్‌ వర్మగా కాకుండా అంతా అతన్ని వరంగల్‌ శివగా గుర్తు పెట్టుకున్నారు. ఇక రీసెంట్‌గా కరణ్ జోహార్ డైరెక్షన్లో లస్ట్ స్టోరీ 2 సిరీస్‌ చేస్తున్నాడు విజయ్‌ వర్మ. ఈ ప్రాజెక్ట్‌లోనే తమన్నాతో కలిసి పని చేశాడు. కొద్ది రోజులకే వీళ్ల పరిచయం ప్రేమగా మారింది. ఇన్ని రోజులూ ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకుని తిరిగారు. ఇప్పుడు అధికారికంగా తాము లవర్స్‌ అని ఎనౌన్స్‌ చేశారు.