టాలీవుడ్ లో ఒకప్పుడు స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలిగిన మిల్కీ బ్యూటి తమన్నా… ఇప్పుడు బాలీవుడ్ లో సైతం అవకాశాల కోసం ఎదురు చూస్తోంది. ఈ మధ్య కాలంలో తన ప్రియుడు విజయ్ వర్మను ఆమె వివాహం చేసుకునే అవకాశం ఉందనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అవి నిజం కాదని తాను ఇప్పట్లో పెళ్లి చేసుకోవట్లేదు అంటూ క్లారిటీ ఇచ్చింది తమన్నా. అలాగే విజయ్ వర్మతో తనకు ఉన్న అనుబంధం గురించి కూడా తమన్నా పలు విషయాలను చెప్పుకొచ్చింది. ఇప్పుడు ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
తాజాగా తమన్నా మరిన్ని వ్యాఖ్యలు చేసింది. గతంలో తనకు ఎదురైన చేదు అనుభవాలను ఆమె వివరించింది. తనకు గతంలోనే రెండు ప్రేమ వ్యవహారాలు ఉన్నాయని ఆమె చెప్తూ… బాధ పడింది. ఇప్పటివరకూ రెండుసార్లు నా హృదయం ముక్కలైంది అని చెప్పిన ఆమె… ఆ సమయంలో నాకెంతో బాధగా అనిపించింది అంటూ గత అనుభవాలను బయట పెట్టింది. టీనేజ్‌లో ఉన్నప్పుడే తొలి హార్ట్ బ్రేక్ ఎదుర్కొన్నానన్న తమన్నా… కేవలం ఒక వ్యక్తి కోసం నచ్చిన జీవితాన్ని వదులుకోవడం నాకు నచ్చలేదు అని తెలిపింది.
అలాగే… జీవితంలో ఏదో సాధించాలని కొత్త విషయాల గురించి అన్వేషించాలనేది నా భావన అని పేర్కొంది. ఆ కారణంతోనే ఆ బంధం నిలబడలేదు అని తన మొదటి బ్రేకప్ గురించి వివరించింది. ఆ తర్వాత మరో వ్యక్తితో కొంతకాలం రిలేషన్‌లో ఉన్నాను అని చెప్పిన తమన్నా… అయితే.. అతడు నాకు సెట్ కాడనిపించిందని… ప్రతి చిన్న విషయానికీ అబద్థం చెప్పేవాళ్లంటే నాకు ఇష్టం ఉండదని… అలాంటి వ్యక్తితో బంధాన్ని కొనసాగిస్తే పమాదం అని అర్థమైంది అంటూ అలా రెండో ప్రేమ వ్యవహారం కూడా ఎండ్ అయిపోయిందని చెప్పుకొచ్చింది. కాగా తమన్నా ‘స్ర్తీ 2’లో స్పెషల్ సాంగ్ చేయగా ఆ సాంగ్ కి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం ‘ఓదెల 2’ చిత్రంలో మిల్కీ బ్యూటి కనపడనుంది.