Vichithra: ఆ హీరో వేధించాడు.. బాలయ్యపై సంచలన ఆరోపణలు చేసిన తమిళ నటి..

కోలీవుడ్‌కి చెందిన సీనియర్ నటి విచిత్ర.. బాలకృష్ణతో “భలేవాడివి బాసు” అనే సినిమా టైంలో జరిగిన చేదు అనుభవాన్ని తమిళ్ బిగ్ బాస్ షో నుంచి షేర్ చేసుకుంది. ఓ సినిమా చిత్రీకరణలో సమయంలో ఆ అగ్ర కథానాయకుడు తనను రూమ్‌కు రమ్మని పిలిచాడని విచిత్ర వెల్లడించారు.

  • Written By:
  • Publish Date - November 22, 2023 / 03:44 PM IST

Vichithra: టాలీవుడ్ స్టార్ నందమూరి బాలకృష్ణపై తమిళ నటి విచిత్ర చేసిన వేధింపుల ఆరోపణలు సంచనలం రేపుతున్నాయి. ఇప్పటికే త్రిష, మన్సూర్ అలీ ఖాన్ మధ్య బిగ్ వార్ నడుస్తుండగా.. ఇప్పుడు తమిళ సినీయర్ నటి బాలయ్యపై చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. గతంలో నటిగా ఉన్న విచిత్ర ప్రస్తుతం కమల్ హాసన్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ తమిళ సీజన్ 7లో పాల్గొంటోంది. నవంబర్ 1న కంటెస్టెంట్స్ తమ జీవితంలో ఒక మలుపు గురించి చెబుతున్నారు.

Prabhas Vs Shah Rukh Khan: బాక్సాఫీస్ యుద్ధం.. సౌత్, నార్త్ మధ్యయుద్ధం ఫిక్స్

ఈ సమయంలో విచిత్ర వంతు రాగా.. ఆమె ఒక తెలుగు చిత్రంలో పనిచేస్తున్నప్పుడు తన కాస్టింగ్ కౌచ్ అనుభవాన్ని ప్రస్తావించింది. దాని ఫలితంగా ఆమె 20 సంవత్సరాల క్రితం సినిమా నుంచి తప్పుకున్నట్లు చెప్పుకొచ్చింది. కోలీవుడ్‌కి చెందిన సీనియర్ నటి విచిత్ర.. బాలకృష్ణతో “భలేవాడివి బాసు” అనే సినిమా టైంలో జరిగిన చేదు అనుభవాన్ని తమిళ్ బిగ్ బాస్ షో నుంచి షేర్ చేసుకుంది. ఓ సినిమా చిత్రీకరణలో సమయంలో ఆ అగ్ర కథానాయకుడు తనను రూమ్‌కు రమ్మని పిలిచాడని విచిత్ర వెల్లడించారు. తాను వెళ్ళకపోవడంతో తనకు టార్చర్ చూపించారని.. ఆ టార్చర్ తట్టుకోలేక తాను రోజుకొక రూంలో ఉండాల్సి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేసింది. ‘స్టార్ హీరో అలా అడిగే సరికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ రాత్రి నా గదికి వెళ్లి నిద్రపోయా. తర్వాత రోజు నుంచి నాకు టార్చర్ మొదలైంది’ అని ‘బిగ్ బాస్’ ఇంటిలో విచిత్ర చెప్పడం చర్చనీయాంశమైంది. అయితే ఈ ఘటనపై యూనియన్‌కు ఫిర్యాదు చేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

Pushpa-2‌: దేవిశ్రీ లీకులు.. ‘పుష్ప 2’ని ఆకాశానికెత్తేస్తున్న దేవిశ్రీ..

తెలుగు సినిమాలో తాను క్యాస్టింగ్ కౌచ్ ఎదుర్కొవడం వల్లనే సినిమాల నుంచి తప్పుకోవాల్సి వచ్చిందని చెప్పింది. విచిత్ర 1991లో సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టింది. అప్పటి నుంచి తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషా చిత్రాలలో కనిపించింది. ఆమె విజయ్ టెలివిజన్ ప్రసిద్ధ వంట రియాలిటీ షో, ‘కుకు విత్ కోమలి 4’లో ఫైనలిస్ట్‌లలో ఒకరిగా పోటీ పడింది. ప్రజెంట్ బిగ్ బాస్ 7లో టాప్ పెర్ఫార్మర్స్‌లో ఒకరిగా దూసుకుపోతోంది. విచిత్ర కామెంట్స్ అటు తమిళం, ఇటు టాలీవుడ్‌లో కలకలం రేపుతున్నాయి.