ఇప్పుడు మన స్టార్ హీరోలు తెలుగు డైరెక్టర్ల కంటే ఇతర భాషల డైరెక్టర్ ల మీదనే ఎక్కువ ఫోకస్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. అగ్ర హీరోలు ఇప్పుడు కమర్షియల్ కోణంలో ఆలోచిస్తూ ఇతర భాషల మీదనే ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. దాదాపు ప్రతీ హీరో ఆలోచన ఇలాగే ఉందనే మాట వాస్తవం. ఇప్పటి వరకు రామ్ చరణ్ ఇతర భాషల మీద పెద్దగా ఫోకస్ చేయలేదు గాని ఇప్పుడు మాత్రం ఇతర భాషల్లో సినిమాలు చేసేందుకు రెడీ అవుతున్నాడు. తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ తో ఓ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్.
గేమ్ చేంజర్ అనే టైటిల్ తో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జనవరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాకు సంబంధించి దాదాపుగా షూటింగ్ పూర్తి కాగా కాస్త వాయిదా పడుతోంది. క్రిస్మస్ కు విడుదల చేయాలని చూసినా కాస్త ఆలస్యమైంది. దాదాపు రామ్ చరణ్ ఈ సినిమా కోసం రెండేళ్ళ నుంచి కష్టపడుతున్న సంగతి తెలిసిందే. వాయిదా పడటంతో మెగా ఫ్యాన్స్ కూడా సినిమాపై సీరియస్ గా ఉన్నారు. ఇక పుష్ప 2 ఉండటంతోనే వాయిదా వేసారనే టాక్ కూడా వస్తోంది ఇప్పుడు.
ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి తన సినిమాను కూడా వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఇదిలా ఉంచితే ఈ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ వెట్రిమారన్ తో రామ్ చరణ్ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఇప్పటికే వెట్రిమారన్ కథ కూడా రెడీ చేసినట్టు సమాచారం. అయితే ఈ విషయంపై ఇప్పటి వరకు రామ్ చరణ్ ఎక్కడా మాట్లాడలేదు. గేమ్ చేంజర్ సినిమా తర్వాత ఏ సినిమా చేస్తాడు అనే దానిపై అసలు క్లారిటీ రావడం లేదు. ముగ్గురు దర్శకులతో చర్చలు జరిపినా రామ్ చరణ్ కు కథ నచ్చలేదు.
దీనితో ఇప్పుడు సినిమా వెట్రిమారన్ తో ఫైనల్ చేసాడని అంటున్నారు. వెట్రిమారన్ కు తమిళంలో మంచి ఇమేజ్ ఉంది. ఇది కచ్చితంగా తనకు హెల్ప్ అవుతుందని రామ్ చరణ్ అంచనా వేస్తున్నాడు. ఇతర హీరోల మాదిరిగా రామ్ చరణ్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ లపై క్లారిటీ ఇవ్వడం లేదు. ప్రశాంత్ నీల్ తో ఇటీవల ఓ సినిమా ఫైనల్ అయిందనే వార్తలు వచ్చాయి గాని అది ఎప్పుడు ఉంటుందో అసలు తెలియదు. అయిదేళ్ళ తర్వాతి మాట. గేమ్ చేంజర్ తర్వాత సినిమా కూడా ఫ్యాన్స్ కి రామ్ చరణ్ క్లారిటీ ఇవ్వడం లేదు.