దేవరను కాను.. కల్కీగా మారలేను… మొత్తంగా1000 కోట్ల శాపం..

దేవర లా నార్త్ ఇండియాని షేక్ చేయాలనుకున్నాడు.. కంగువాకి కుదరలేదు.. బాహుబలిలా పొన్నియన్ సెల్వం సినీ సునామీ తెస్తుందనుకున్నారు. అది జరగలేదు.. శంకర్ తీసిన రోబో2.0 పెట్టుబడి 500 కోట్లు దాటింది కాని, కలెక్షన్లు ఆరేంజ్ లో రీచ్ అవ్వలేదు.

  • Written By:
  • Publish Date - November 18, 2024 / 05:29 PM IST

దేవర లా నార్త్ ఇండియాని షేక్ చేయాలనుకున్నాడు.. కంగువాకి కుదరలేదు.. బాహుబలిలా పొన్నియన్ సెల్వం సినీ సునామీ తెస్తుందనుకున్నారు. అది జరగలేదు.. శంకర్ తీసిన రోబో2.0 పెట్టుబడి 500 కోట్లు దాటింది కాని, కలెక్షన్లు ఆరేంజ్ లో రీచ్ అవ్వలేదు. కాని వెయ్యికోట్ల అరవోళ్ల కల పీడకలలా మారింది. ఎంత పెద్ద సినిమా తీసినా, పాన్ ఇండియా లెవల్లో తమిళ సినిమాకు సీన్ మారట్లేదు. కాని దేవర, కల్కీ, సలార్, త్రిబుల్ ఆర్ ఇలా ఒక్కో ఏడాది 500 కోట్ల నుంచి వెయ్యికోట్ల వరకు రాబట్టే తెలుగు సినమాల లిస్ట్ పెరుగుతోంది. ఒక వైపు తమిళ సినిమాకు వెయ్యికోట్ల కల తీరట్లేదు. మరో వైపు తెలుగు వాళ్లకు వెయ్యికోట్లు వసూల్ల వరదలు కామనైపోయాయి… అంతే దెబ్బకి ప్రెషర్ లోకెళ్లి బాహుబలినో, దేవరనో కాపీ కొట్టడమే పనిగా పెట్టుకున్నారు. కాని కాపీ కొట్టే టైంలోనే తప్పు జరుగుతోంది… దేవర, బాహుబలి, కల్కీ లో ఉందేంటి..? అరవమూవీల్లో లేందేంటి… వాళ్ల కల ఎప్పటికీ పీడకలేనా?

దేవర 510 కోట్ల షేర్ వసూళ్లే మొత్తం పాన్ ఇండియాని షేక్ చేశాయి. విచిత్రం ఏంటంటే ఇంకా ఈ రోజుల్లో కూడా 50 రోజుల్లో 50 కోట్లు రాబట్టిన సినిమాల లిస్ట్ కల్కీ తర్వాత దేవరకే వచ్చింది. ఇలాంటి ట్రెండ్ సెట్టింగ్ రికార్డులు, పాన్ ఇండియా లెవల్లో 1000 కోట్లు, 500 కోట్ల వసూళ్లు.. నార్త్ లొ మాస్ మతిపోగొట్టే ఫ్యాన్ బేస్ ఇవన్నీ తెలుగు హీరోల సొంతం.. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్ ఆ విషయంలో టాప్ లో ఉన్నారు

కాని ఇలాంటి రికార్డులు, హిస్టరీ క్రియేట్ చేసే అవకాశాలు తమిళ తంబీలకు రాలేదు. గతంలో తమని తామే ఎక్కువని ఊహించుకుని, ఆ ఊహల్లో పొరుగింటి సినిమాలను తక్కువ చేసే వాళ్లకి, శంకర్, మణిరత్నం లాంటి వాళ్లే గొప్ప మేకర్స్.. వాళ్లు నిజంగాట్యాలెంటెడ్ డైరెక్టర్లే కాని, పాన్ ఇండియా అడ్డుగోడల్ని కూలగొట్టిన ఘనత మాత్రం తెలుగు దర్శకుడు రాజమౌలిదే..

బాహుబలి వచ్చినప్పటి నుంచి సాహో, పుష్ప, త్రిబుల్ ఆర్, సలార్, కల్కీ, ఇలా వరుసగా తెలుుగ సినిమాలే పాన్ ఇండియాని ఏలుతున్నాయి. 1000 కోట్ల వసూళ్లు మన మూవీలకు కామనైపోయాయి.

కాని కోలీవుడ్ స్టార్లకు 500 కోట్లను రీచ్ అవటమే అదో గొప్ప విషయంగా మారింది. ఇక 1000 కోట్లనేది తీరని కలగానే మారింది. ఇలా 9 ఏళ్లుగా రోబో 2.0, పొన్నియన్ సెల్వం రెండు భాగాలు, భారతీయుడు 2, విక్రమ్, వెట్టయాన్, లీయో, కంగువా ఇలా ఎన్ని పాన్ ఇండియా ప్రయోగాలు చేసినా, 1000 కోట్లు కాదు కదా, కనీసం 500 కోట్ల క్లబ్ లో కూడా అడుగుపెట్టలేకపోతున్నారు

మరీ ముఖ్యంగా తమిళ్ , మలయాళం ,ఓవర్ సీస్ లో తప్ప తమిళ మూవీలకు, తెలుగు,కన్నడ, హిందీ మార్కెట్లో పెద్దగా వసూళ్లు రావట్లేదు. ఇదే వాళ్లని పిచ్చెక్కిస్తుందంటే, ఈలోపు కల్కీ, దేవర అంటూ ప్రభాస్, ఎన్టీఆర్ వందల కోట్ల వసూళ్లని వేల కోట్లుగా మారుస్తున్నారు. ఆఖరికి, కార్తికేయ2, జై హనుమాన్, మేజర్ లాంటి లోబడ్జెట్ మూవీలు కూడా పాన్ ఇండియాని మరీ ముఖ్యంగా నార్త్ ఇండియాని షేక్ చేస్తున్నాయి.

ఇవే ఎక్కువగా తమిళ తంబీలను కలవర పరుస్తున్నాయి. ఏదేమైనా కంగువా మూవీ టాకే బాలేదనుకుంటుంటే, దేవర మూవీ వసూళ్లు, దేవర రికార్డులు, ఓటీటీలో దేవర సందడి ఇవన్నీంటితో కంగువ మూవీని పోల్చటం మరింత మైనెస్ గా మారుతోంది. వాళ్ల వెయ్యికోట్ల కల పీడకలగానేమిగిలిపోతోంది.