Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లక్ష్యంగా కోలీవుడ్ దర్శకులు భారీ స్కెచ్ వేసినట్టున్నారు. అదేంటో నెల్సన్‌కు రజినీకాంత్ పిలిచి ఆఫర్ ఇచ్చాడు. అట్లీకి తమిళ దళపతి విజయ్ ఛాన్స్ ఇచ్చాడు. అయినా పని కట్టుకుని వాళ్లని వదిలేసి బన్నీ కోసమే క్యూ కట్టారు పాన్ ఇండియా తమిళ దర్శకులు. జైలర్ హిట్ తర్వాత రజినీకాంత్‌తో జైలర్ 2 ప్లాన్ చేసిన నెల్సన్ దిలీపే.. బన్నీని కలిసి కథ వినిపించటం, అటునుంచి గ్రీన్ సిగ్నల్ రావటం జరిగిపోయింది. నిజగానికి జైలర్ మూవీ చిరంజీవి చేయాల్సింది.
బీస్ట్ మూవీ తీస్తున్న టైంలో చిరుకి కథ వినిపించిన నెల్సన్‌కి మెగాస్టార్ నుంచి ఆన్సర్ రాకపోవటం, బీస్ట్ ప్లాప్‌తో నెల్సన్ కూడా మరో దారి వెతుక్కోవటం జరిగింది. ఆ ప్రాసెస్‌లో జైలర్ రజినీతో తీసి హిట్ కొట్టిన నెల్సన్, సడన్‌గా జైలర్ 2 ప్లాన్ చేస్తూనే బన్నీకి కథ చెప్పడం హాట్ టాపిక్ అయ్యింది. తనే కాదు జవాన్ హిట్‌తో స్వింగ్‌లో ఉన్న అట్లీ కూడా గతంలో బన్నీకే కథ చెప్పాడు. ఇప్పుడా ప్రాజెక్ట్ పట్టాలెక్కించే పనిలో ఉన్నాడు. విచిత్రంగా రామ్ చరణ్ పిలిచి ఛాన్స్ ఇచ్చినా తనకి మాట మాత్రమే ఇచ్చిన లోకేష్ కనకరాజ్, బన్నీకి మాత్రం మంచి స్టోరీని అందించాడట. ఆ కథ నచ్చి అల్లు అర్జున్ సినిమాకి రెడీ అనటంతో 2025 ఆగష‌్టులో ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కించబోతున్నాడట విక్రమ్ ఫేం లోకేష్.
చరణ్, ఎన్టీఆర్, ప్రభాస్ ఇలా ఎంత మంది పాన్ ఇండియా తెలుగు స్టార్స్ ఉన్నా, పుష్పరాజ్‌తో ఊరమాస్ స్టార్‌గా మారిన బన్నీనే తమిళ తంబీలకు బాగా నచ్చాడో, లేదంటే అల్లు అర్జునే ఏదో మంత్రమేశాడో కాని, ఈ తమిళ పాన్ ఇండియా డైరెక్టర్స్ అంతా బన్నీ ఇంటికి క్యూ కడుతున్నారు.