కల్కీ.. దేవర.. పుష్ప2 …అరవోళ్ల అసూయ అరుపులు..

2024 నిజంగా అరవోళ్లకి పీడకల అనుకుంటుంటే, వాళ్లు తెలుగు హీరోల చూసి కుళ్లుకోవటం కాదు, మన హిట్లను చూసి కుళ్లిపోయే పరిస్థితొచ్చింది. కంగువ, వెట్టయాన్, భారతీయుడు 2 ఇలా అక్కడ అన్నీ అడ్డగోలు ఫ్లాపులే షాక్ ఇస్తే, ఇక్కడ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లు....

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 07:45 PM IST

2024 నిజంగా అరవోళ్లకి పీడకల అనుకుంటుంటే, వాళ్లు తెలుగు హీరోల చూసి కుళ్లుకోవటం కాదు, మన హిట్లను చూసి కుళ్లిపోయే పరిస్థితొచ్చింది. కంగువ, వెట్టయాన్, భారతీయుడు 2 ఇలా అక్కడ అన్నీ అడ్డగోలు ఫ్లాపులే షాక్ ఇస్తే, ఇక్కడ హ్యాట్రిక్ పాన్ ఇండియా హిట్లు…. కల్కీ 1200 కోట్ల సునామీ రాబడితే, దేవర 510 కోట్ల కిక్ ఇచ్చింది. కట్ చేస్తే పుష్ప2 కూడా దుమ్ముదులుపుతోంది.. అలాని 800 కోట్ల పైన వసూళ్లొచ్చవనే మ్యాటరే కాస్త నమ్మశక్యంగా లేదు. సినిమా రిలీజైన రెండో రోజే టాక్ వీకైనా, నార్త్ ఇండియాలో మాత్రం పుష్ప2 వసూళ్లు షాక్ ఇస్తున్నాయి.. కాసేపు కలెక్షన్స్ సంగతి అటుంచితే, ఇలా కూడా ఓ తమిళ మూవీ పాన్ ఇండియా లెవల్లో దుమ్ముదులపలేకపోతోంది.

పుష్ప2 వసూల్ల వెనక లోపాలన్నాయా? నిజంగానే నిర్మాతలు ఎనౌన్స్ చేస్తున్న వందలకోట్ల లెక్కలు నిజామా అన్న డిస్కర్షన్ పక్కన పెడితే, టాక్ ఎలా ఉన్నా, పుష్ప 2 విషయంలో అరవోల్ల అసూయ అరుపుల్లో కూడా హ్యాట్రిక్ షాక్ కనిపిస్తోంది

అక్కడ పాన్ ఇండియా హిట్ కోసం గించుకుంటుంటే, మనోళ్లు పాన్ ఇండియా హిట్లతో హ్యాట్రిక్ షాకులిస్తున్నారు. వెయ్యికోట్ల వసూళ్లని కామన్ గా మారుస్తున్నారు… అసలు ఈ ఏడాదిని కల్కీ హిట్ తో పాన్ ఇండియా లెవల్లో షురూ చేశాడు రెబల్ స్టార్ ప్రభాస్

కట్ చేస్తే తర్వాత వచ్చిన దేవర పాన్ ఇండియాని షేక్ చేసింది. ఇక పుష్ప2 కి సౌత్ లో టాక్ వీకైనా, హిందీ వసూల్ల వల్ల ఇది పాన్ ఇండియా హిట్ గా కన్ఫామ్ అయ్యింది. కట్ చేస్తే మూడు పాన్ ఇండియా హిట్లతో బాక్సాఫీస్ లో తెలుగు వెలిగిపోతోంది

తమిల్ మాత్రం పాన్ ఇండియా లెవల్లో కాదు, లోకల్ మార్కెట్ లో కూడా నలిగిపోతోంది. కమల్ హాసన్ మూవీ భారతీయుడు 2 డిజాస్టర్ అనుకుంటే, అంతకుమించిన ఫ్లాప్ గా రజినీకాంత్ వెట్టయాన్ పంచ్ ఇచ్చింది. ఇక సూర్య భారీ బడ్జెట్ మూవీ కంగువా అయితే బాక్సాఫీస్ లో బోనీ కొట్టకుండానే బొక్క బోర్లా పడింది.

ఎప్పుడూ వాళ్ల కల్చర్, వాళ్ల హీరోలు, వాళ్ల భాష, వాళ్ల గోసే పక్కొడి గురించే అరవోళ్ల కు పట్టదు..మర హీరోలు ఎన్ని హిట్ మూవీలు తీసినా, అక్కడోల్లు చూడరు… మెచ్చుకోరు. బాహుబలి, త్రిబుల్ ఆర్ నే అతికష్టంగా అయిష్టంగానే మెచ్చుకోవాల్సి వచ్చింది..

అలాంటి బ్యాచ్ వరుసగా పాన్ ఇండియా హ్యాట్రిక్ ప్లాపులు తీస్తుంటే, తెలుగులో పాన్ ఇండియా హ్యాట్రిక్ హిట్లు కిక్ ఇస్తున్నాయి. ఇంకా హనుమాన్ ని కూడా కలిపితే నాలుగు పాన్ ఇండియా హిట్లు… వచ్చినట్టే… ఇంకా సలార్ లాస్ట్ ఇయర్ డిసెంబర్ ఎండ్ లో వచ్చింది కాబట్టి, అది కూడా కలిపితే ఈ ఏడాది 5 పాన్ ఇండియా బ్లాక్ బస్టర్లు టాలీవుడ్ సొంతం…. సంక్రాంతికి వచ్చే హిట్ డబుల్ హ్యాట్రిక్ లాంటి ఫినిషింగ్ టచ్ ఇచ్చే ఛాన్స్ఉంది.