దేవర మీద కుళ్లే కొంపముంచుతోంది…? అరవ కష్టాలు షురూ..!

దేవర తెలుగులో వందలకోట్లు వసూళ్లు రాబట్టింది. హిందీ లో అయితే సౌత్ నే మించిపోయింది. కన్నడ లో బిగినింగ్ లో వసూళ్ళ వరద కొద్దిగా ఉన్నా, విడుదలైన రెండో వారం నుంచి కన్నడ బాక్సాఫీస్ ని షేక్ చేసింది దేవర. ఆఖరికి క్లాస్ మూవీలు, ప్రయోగాలు మాత్రమే ఎంకరేజ్ చేసే మలయాళం మార్కెట్ లో కూడా దేవర జోరు కనిపించింది.

  • Written By:
  • Publish Date - November 9, 2024 / 05:47 PM IST

దేవర తెలుగులో వందలకోట్లు వసూళ్లు రాబట్టింది. హిందీ లో అయితే సౌత్ నే మించిపోయింది. కన్నడ లో బిగినింగ్ లో వసూళ్ళ వరద కొద్దిగా ఉన్నా, విడుదలైన రెండో వారం నుంచి కన్నడ బాక్సాఫీస్ ని షేక్ చేసింది దేవర. ఆఖరికి క్లాస్ మూవీలు, ప్రయోగాలు మాత్రమే ఎంకరేజ్ చేసే మలయాళం మార్కెట్ లో కూడా దేవర జోరు కనిపించింది. అక్కడ కూడా దేవర లాంటి ఊర మాస్ యాక్షన్ డ్రామాకి పాజిటివ్ రెస్పాన్సే వచ్చింది. ఎటొచ్చి ఎన్టీఆర్ దేవరని కోలీవుడ్ లోనే అంతగా ఆదరించలేదు. మొదట్లో బానే టాక్ వచ్చినా, థియేటర్స్ ని తమిళ సినిమాలతో నింపటం కూడా ఓకారణం కావొచ్చు… ఇలా చేసినందుకే ఇప్పుడు తెలుగులో తమిళ వెలుగులు కష్టమౌతున్నాయా? కోలీవుడ్ స్టార్ సూర్య కంగువాకి టాలీవుడ్ మార్కట్ లో కష్టాలు తప్పవా..?

దేవర విడుదలకు ముందు బాలీవుడ్ లో సౌత్ స్టార్లను వ్యతిరేకించే బ్చాచ్ కామెంట్ల దాడి చేస్తే, విడుదలయ్యాక దేవర ని లైట్ తీసుకుని, తమిళ తంబీలు కాస్త అతిచేశారు. నిజానికి మాస్ కంటెంట్ కి అరవ అడ్డాలో మంచి డిమాండ్ ఉంది. దేవర అక్కడ బానే ఆడే అవకాశం ఉండేది. కాని ఆ టైంలో అక్కడి చిన్న సినిమాలకు థియేటర్స్ ఇచ్చి, దేవరని కాస్త్ ఇబ్బంది పెట్టారు. తెలుగు,కన్నడ, హిందీ మార్కెట్లతో దేవర దూసుకెళుతుంటే, మలయాళం మార్కెట్ లో కూడా ఈ సినిమాకు మాంచి ఊపొచ్చింది

తర్వాత తమిళనాట దేవరకి కూడా వసూళ్ల వరద పెరుగుతోందన్న టైంలో, వెట్టయాన్ ని కూడా వదలారు. కాని సీన్ రివర్స్ అయ్యి, దేవర జోరుని వెట్టయాన్ తట్టుకోలేకపోయాడు. కొంతవరకు వీక్ కంటెంట్ కూడా కారణమే…

అయితే దేవర నే కాదు, త్రిబుల్ ఆర్, సలార్, ఇలా చాలా తెలుగు పాన్ ఇండియా సినిమాలు దేశం అంతటా ఆడుతున్నా, తమిళ నాట మాత్రం లైట్ తీసుకోవటం కనిపించింది. వాళ్లవే సినిమాలు.. వాళ్లే హీరోలు.. కంటెంట్ బాగున్నా, పొరుగింటి హీరోలని, సినిమాలను వాళ్లు పట్టించుకోరని ఎన్నో సార్లు ప్రూవ్ అయ్యింది

కాని కంటెంట్ బాగుంటేహీరో ఎవరని చూడని తెలుగు ఆడియన్స్ లానే, మలయాళం, కన్నడ, హిందీ మార్కెట్ లో మంచి సినిమాలకు ఆదరన కనిపించింది. కాబట్టే దేవర, త్రిబుల్ ఆర్, సలార్, కల్కీ, బాహుబలి ఇవన్నీ పాన్ ఇండియాని షేక్ చేయగలిగాయి..

కాని అదేంటో తమిళ మార్కెట్ లో మాత్రం తెలుగు పాన్ ఇండియా సినిమాలు మాత్రం పెద్దగా వసూళ్లు రాబట్టలేకపోతున్నాయి. మరి కంటెంట్ లో లోపమా అంటే, దేశం అంతా మెచ్చుకున్న సినిమా, అరవోళ్లకి నచ్చలేదంటే తప్పెవరిలో ఉంది… ఇదే తెలుగు ఆడియన్స్ కి మండేలా చేస్తోంది. మరీ ముఖ్యంగా దేవర లాంటి సినీ సునామీని లైట్ తీసుకున్న అవరోళ్ల అహంకారం అనేలా ఎమోషన్స్ ని రేయిజ్ చేసింది. ఫలితంగా కంగువాని ఇక్కడి జనం లైట్ తీసుకుంటున్నట్టున్నారు. ప్రమోషన్ లోఎమోషన్ ఎంత పెంచినా, పెద్దగా అయితే ఇక్కడ హైప్ రావట్లేదు. వెట్టయాన్ కి అదే జరిగింది. సత్యం సుందరం కి ఇక్కడ థియేటర్స్ లో సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు కంగువా కూడా కంగురు పడాల్సి వస్తోంది.