ట్రిపుల్ ఆర్ (RRR) తర్వాత తారక్ నటిస్తోన్న సినిమా కావడంతో దేవర పై అటు నార్త్ ఇండస్ట్రీలో ఓ రేంజ్ హైప్ నెలకొంది. ఇందులో సరికొత్తగా మాస్ అవతారంలో కనిపించనున్నారు ఎన్టీఆర్. ఆ మధ్య రిలీజైన టీజర్… రీసెంట్ గా వచ్చేసిన ఫియర్ సాంగ్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ఎన్టీఆర్ కు జోడిగా ఈ సినిమాలో జాన్వీతోపాటు.. గుజరాతీ అమ్మాయి శ్రుతీ మరాఠే కీలక పాత్రలో నటిస్తోదని వార్తలు వినిపించాయి. ఈ మూవీ గురించి నిత్యం ఏదోక వార్త నెట్టింట హల్చల్ చేస్తుండగా…. తాజాగా మరో న్యూస్ సెన్సేషన్ గా మారింది.
పాన్ ఇండియా లెవల్లో రెండు భాగాలుగా రూపొందిస్తున్న ఈ సినిమా ఫస్ట్ పార్ట్ దసరా కానుకగా అక్టోబర్ 10న గ్రాండ్ గా రిలీజ్ కానుంది. హై ఓల్టేజ్ యాక్షన్ తో తెరకెక్కుతున్న ఈ మూవీపై కొరటాల శివ ఫుల్ ఫోకస్ పెట్టాడు. ఎన్టీఆర్ ఊర మాస్ రగ్గడ్ లుక్లో కనిపించనున్నట్లు టీజర్, ఫియర్ సాంగ్ చూస్తే అర్థమవుతోంది. తాజాగా ఈ సినిమాకు జూనియర్ ఆర్టిస్ట్ గా పని చేసిన వ్యక్తి ఈ మూవీ స్టోరీ లీక్ చేయడం హాట్ టాపిక్ గా మారింది.
సముద్రపు ఒడ్డున ఉండే ఊళ్లు, సముద్ర దొంగలు కథాంశంతో దేవర సినిమా రాబోతుందని లీక్ చేశాడు జూనియర్ ఆర్టిస్ట్ . పైగా పదివేల మందితో తారక్ చేసే ఫైట్ సీన్ నెవర్ బిఫోర్ అనేలా ఉంటుందట. సముద్రం దగ్గర పది ఊర్లకు కాపరిగా ఎన్టీఆర్ ఉంటాడని… ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా తానే అన్ని చూసుకుంటూ ఉంటాడని… అలాగే సముద్రం దగ్గర ఫైట్ సీన్ అదిరిపోతుందని సీక్రెట్ ను రివీల్ చేశాడు. సముద్రం అంతా రక్తంతో నిండిపోతుందని… ఈసీన్ సినిమాకే హైలెట్ గా నిలిచే లా కొరటాల ప్లాన్ చేశాడని చెప్పుకొచ్చాడు. దీంతో సినిమాను చూసేందుకు తారక్ ఫ్యాన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.