అభిమాని మృతి విషయం తెలిసిన జూనియర్ ఎన్టీఆర్ సంతాపం వ్యక్తం చేశారు. విచారణ చేయాలని విజ్ఞప్తి చేశారు. శ్యామ్ మరణం అత్యంత బాధాకరమైన సంఘటన అని ఎన్టీఆర్ ఓ లేఖ విడుదల చేశారు. అభిమాని కుటుంబానికి ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ఎటువంటి పరిస్థితుల్లో, ఎలా చనిపోయి ఉంటాడో తెలియకపోవడం మనసును కలిచి వేస్తుందంటూ ఎన్టీఆర్ రాసుకొచ్చిన మాటలు మనసును భారంగా మారుస్తున్నాయ్.
ఎన్టీఆర్ వీరాభిమాని అయిన శ్యామ్ స్వస్థలం తూర్పు గోదావరి జిల్లాలోని ముమ్మిడివరం నియోజకవర్గం కాట్రేనికోన మండలంలోని కొప్పిగుంట. కొంతకాలంగా అతని కుటుంబం తిరుపతిలో ఉంటుంది. శ్యామ్ ఈ మధ్య ఆత్మహత్య చేసుకున్నడాు. అతడిది సూసైడ్ అంటూ పోలీసులు ప్రకటించారు. కానీ టీడీపీ అధినేత చంద్రబాబుతో పాటు పార్టీ వర్గాలు మాత్రం శ్యామ్ మరణంపై అనుమానాలు వ్యక్తం చేశారు. శ్యామ్ మరణం వెనక వైసీపీ ప్రమేయం ఉందంటూ ఆరోపించారు. శ్యామ్ మరణానికి కారకులను శిక్షించాలంటూ సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు.
ఇలాంటి పరిస్థితుల మధ్య ఎన్టీఆర్ కూడా.. అభిమాని మరణంపై స్పందించడం రాజకీయ, సినీ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది. శ్యామ్ మరణానికి కారణాలు తెలియకపోవడం బాధాకరమంటూ ఎన్టీఆర్ చేసిన వ్యాఖ్యలు మరింత ఆసక్తిక రేకిస్తున్నాయ్. ఇక అటు శ్యామ్ ఆత్మహత్య చేసుకోవడానికి ముందు తీసుకున్న సెల్ఫీ వీడియో కూడా.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.