ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న పుష్ప 2 సినిమాకు తెలంగాణా సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. పుష్ప-2 టికెట్ ధరలు పెంపునకు తెలంగాణా సర్కార్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. డిసెంబర్ 4న రాత్రి 9:30 గంటలకే పుష్ప-2 షో వేయనున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు బెనిఫిట్ షోకి అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. బెనిఫిట్ షోలకు టికెట్ ధర రూ.800 చేసారు. సింగిల్ స్క్రీన్‌లో టికెట్‌పై రూ.150 పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. మల్టీప్లెక్స్‌లో టికెట్‌పై రూ.200 పెంచారు. డిసెంబర్ 5న విడుదలకానున్న పుష్ప-2 సినిమాలో హీరోయిన్ గా రష్మిక మందన్న నటించగా… విలన్ గా ఫాహాద్ ఫాజిల్ నటించాడు.