GUNTUR KAARAM: గుంటూరు కారం.. నిర్మాతలకు గుడ్‌న్యూస్‌ చెప్పిన తెలంగాణ సర్కార్..

సింగిల్ స్క్రీన్‌లో 65 రూపాయలు.. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో వందల రూపాయల వరకు.. టికెట్ ధరలు పెంచుకునేందుకు చాన్స్ ఇచ్చింది. ఫ్యాన్స్‌ కోసం బెనిఫిట్ షోల ప్రదర్శనకు ఓకే చెప్పింది. తెలంగాణలో 23 చోట్ల ఈనెల 12న అర్ధరాత్రి ఒంటి గంటకు షోలు వేయబోతున్నారు.

  • Written By:
  • Publish Date - January 9, 2024 / 05:45 PM IST

GUNTUR KAARAM: గుంటూరు కారం మూవీ సూపర్ బజ్ క్రియేట్ చేసింది. వింటేజ్‌ మహేష్‌ అంటూ.. ఫ్యాన్స్ చేస్తున్న హడావుడి అంతా ఇంతా కాదు. దీనికితోడు రిలీజ్ కూడా భారీ స్థాయిలో ప్లాన్‌ చేస్తున్నారు. గుంటూరు కారంతోనే సంక్రాంతి సందడి మొదలు కానుంది. మహేశ్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న ఈ మూవీ కోసం.. ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్‌ చేస్తున్నారు. మూవీ టీమ్‌కు పండగ మూడు రోజులు ముందే వచ్చినట్లు అయింది. చిత్ర బృందానికి.. తెలంగాణ ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది.

Kalki 2898 AD: చిరు డేట్‌ను పట్టారు.. ఆ సెంటిమెంట్ డేట్​కే ప్రభాస్ ‘కల్కి’

టికెట్ ధరల పెంపునకు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేసింది. సింగిల్ స్క్రీన్‌లో 65 రూపాయలు.. మల్టీఫ్లెక్స్ థియేటర్లలో వందల రూపాయల వరకు.. టికెట్ ధరలు పెంచుకునేందుకు చాన్స్ ఇచ్చింది. ఫ్యాన్స్‌ కోసం బెనిఫిట్ షోల ప్రదర్శనకు ఓకే చెప్పింది. తెలంగాణలో 23 చోట్ల ఈనెల 12న అర్ధరాత్రి ఒంటి గంటకు షోలు వేయబోతున్నారు. సంక్రాంతి సందర్భంగా ఆరో షో ప్రదర్శనకు కూడా ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఉదయం 4 గంటల షోను కూడా ప్రదర్శించనున్నారు. మహేష్‌ మూవీకి యావరేజీ టాక్ వచ్చినా చాలు.. రికార్డ్ బ్రేక్‌ కావడానికి ! పైగా భారీ రిలీజ్‌లు, టికెట్ల రేట్ల పెంపుతో.. బాక్సాఫీస్ సరదా తీరిపోవడం ఖాయం.. మజా రావడం ఖాయం అంటూ ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. త్రివిక్రమ్‌ శ్రీనివాస్ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో.. శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.

మహేశ్ తల్లి పాత్రలో రమ్యకృష్ణ కనిపించబోతున్నారు. ప్రకాశ్ రాజ్‌, జగపతిబాబు కూడా కీ రోల్స్ చేస్తున్నారు. ఇక అటు మూవీ ప్రీ రిలీజ్‌ కోసం గుంటూరులో భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మహేష్‌ నుంచి పక్కా మాస్‌ మూవీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్న ఫ్యాన్స్‌.. గుంటూరు కారంతో ఫుల్ మీల్స్ ఖాయం అని ఫిక్స్ అయ్యారు. కుర్చీ సాంగ్‌, ట్రైలర్ అంచనాలు మరింత పెంచేశాయ్‌.