మంచు హీరోలంటే ఎవరికీ లెక్కలేదంటారు… ట్రోలింగ్స్ కి తప్ప వాళ్ల ఫ్యామిలీ తాలూకు వీడియోలు యూ ట్యూబ్లో మరెంందుకు ఫోకస్ కావనంటారు. రెబల్ స్టార్ ప్రభాస్ అండ్ కోని కన్నప్పలో గెస్ట్ గా పెట్టడం వల్లే ఆ సినిమా అప్ డేట్జ్ జనం పట్టించుకుంటున్నారు కాని, లేకపోతే, ఈ మంచు హీరో గురించి పట్టించుకునేదెవరు? అన్న కామెంట్స్ కూడా వినిపిస్తూ ఉంటాయి.. విచిత్రం ఏంటంటే సినిమాతో కాకుండా, ఫ్యామిలీ గొడవలతో మంచు బ్యాచ్ వార్తల్లో కెక్కింది. వెయ్యికోట్ల హిట్లతో పాన్ ఇండియా లెవల్లో తెలుగు హీరోలు ఫోకస్ అవుతుంటే, వెయ్యికోట్ల బడ్జెట్ పెట్టినా కొందరు లోకల్ గా కూడా ఫోకస్ అయ్యేలా లేరనే ట్రోలింగ్ కూడా కామనైంది. కామెంట్లకు పాన్ఇండియా లెవల్లో మంచు కవచం కరిగిపోతోందన్న ట్రోలింగ్ షాక్ ఇస్తోంది.. ఇంతకి ఏంజరుగుతోంది?
మంచు మనోజ్ కి హిట్లు లేవు. ఏదో ఒకటి అర మూవీలు చేసుకుని కమ్ బ్యాచ్ ఇచ్చుకునే పనిలో ఉణ్నాడు. కాని జనాల్లో మంచి నటుడిగా, మంచి వ్యక్తిగా పేరుంది. మంచు విష్ణు కన్నప్పతో పాన్ ఇండియా హిట్ కొడతానంటూ, లోకల్ గా మిస్ అయిన సక్సెస్ ని, గ్లోబల్ గా సొంతం చేసుకుంటానంటూ కోట్లు ఖర్చు చేస్తున్నాడు. అందుకు ప్రభాస్, అండ్ కో సాయం తీసుకుంటున్నాడు.
ఇక కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎప్పుడో సీరియస్ గా నటనికి కామా పెట్టి, అప్పడప్పుడు సినిమాల్లో మెరుస్తున్నాడు. ఇలాంటి టైంలో సడన్ గా గాయాలతో హాస్పిటల్ లోచేరిన మంచు మనోజ్ అన్న వార్త షాక్ ఇచ్చింది. హాస్పిటల్ కి మనోజ్ వచ్చినప్పుటి విజువల్స్ లో తను నార్మల్ గానే కనిపించినా, తనకి కడుపులో మరీ ముఖ్యంగా కాలయానికి గాయాలవ్వటం, వెన్నుముకకి ఫ్రాక్చర్ అయ్యిందంటూ వార్తలు రావటంతో సినీజనం షాక్ అవుతున్నారు
బేసిగ్గా మంచు ఫ్యామిలీ అంటేనే ట్రోలర్స్ కి పండగనే అభిప్రాయముంది. కొందరైతే పరిది లేకుండా అనవసరంగా కూడా మంచు ఫ్యామిలీని ట్రోలింగ్స్ లోకి లాగటంతో, కోర్టు కేసుల వరకు సీన్ వెళ్లింది. కట్ చేస్తే అప్పటి నుంచి
ఈ రాద్దాంతం తగ్గింది
ఇంతలో ఫ్యామిలీ గొడవలు రచ్చకెక్కేలా ఉన్నాయనే గుసగుసలు పెరిగాయి. ఏది నిజమో తేలకుండా ఓ కొలిక్కిరావటం కష్టం. ఐతే ఈవారమే మంచు బాంబు పేలనుందనే వార్తలు మాత్రం ఆగట్లేదు. ఎందుకంటే ఆస్తి పంపకాల విషయంలో తేడా వచ్చే మంచు మనోజ్ం, తండ్రి మోహన్ బాబుతో గొడవ పడ్డాడని, అన్న విష్ణు ఫ్రెండే తన మీద చేయి చేసుకున్నాడనే వార్తలొచ్చాయి
కట్ చేస్తే మోహన్ బాబు, మంచుమనోజ్ ఇద్దరూ ఒకరి మీద ఒకరు డయల్ హండ్రెడ్ కి కాల్ చేసి కేసులుపెట్టడం వరకైతే వార్తలొచ్చాయి కాని, కొత్తగా మనోజ్ బాంబు పేల్చేపనిలో ఉన్నాడనే గుసగుసలే ఊపందుకున్నాయి. ఆస్తి పంపకాల్లో అన్నకే అన్నీ ఇచ్చి, తనకి తన తండ్రి అన్యాయం చేశాడనే విషయాన్ని మంచు మనోజ్ మీడియా ముందు చెబుతాడని ఒక వార్త, మోహన్ బాబే మీడియా ముందుకొస్తాడని మరో ప్రచారం షురూ అయ్యింది. కొందరైతే, కలహాలు లేని కుటుంబం ఉంటుందా? జస్ట్ ఇంట్లో సమస్యే అని మోహన్ బాబు ఈ మ్యాటర్ ని ఎస్కలేట్ కాకుండా, చేస్తాడనే అంచనాలు కూడా ఉన్నాయి. కాకపోతే మనోజ్ కి అయిన గాయాలు తీవ్రమైతే మాత్రం ఈ వారంలో ఏదైనా భారీ ప్రెస్ మీట్ ఉండొచ్చనే ఊహాగానాలను పెంచేస్తోంది.