ఎన్టీఆర్ ఇమేజ్ డ్యామేజ్ చేస్తున్న దేవర ప్రమోషన్స్, సంబంధం లేని వ్యక్తులతో

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో మన అందరికి ఒక అవగాహన ఉంది. రాజమౌళి సినిమా ప్రమోషన్ అంటే హీరోల ఇమేజ్ కి ఎక్కడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండకపోగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది. కాని దేవర ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గుతుంది.

  • Written By:
  • Publish Date - September 16, 2024 / 08:29 PM IST

ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషన్స్ ఏ రేంజ్ లో జరిగాయో మన అందరికి ఒక అవగాహన ఉంది. రాజమౌళి సినిమా ప్రమోషన్ అంటే హీరోల ఇమేజ్ కి ఎక్కడా డ్యామేజ్ అయ్యే అవకాశం ఉండకపోగా వాళ్ళ స్థాయి పెరుగుతుంది. కాని దేవర ప్రమోషన్స్ విషయానికి వస్తే ఎన్టీఆర్ స్థాయి తగ్గుతుంది. అవును ఫ్యాన్స్ కు ఈ మాట నచ్చకపోయినా ఎన్టీఆర్ రేంజ్ కి తగ్గ ప్రమోషన్స్ జరగడం లేదు. నమ్మడం లేదా…? దేవర సినిమాకు సందీప్ రెడ్డి వంగాకు సంబంధం ఏంటీ అసలు…? ఆయనకు ఏమైనా ప్రత్యేకంగా ఫాలోయింగ్ ఉందా…?

యానిమల్ సినిమా తర్వాత ఆయనకు క్రేజ్ వచ్చింది కాదు అనలేం… కాని ఎన్టీఆర్ కు ఆయనకంటే ఎక్కువ ఫాలోయింగ్ ఉంది కదా…? అలాంటప్పుడు ఏ స్టార్ హీరోతోనో కూర్చుని ఇంటర్వ్యూ చేస్తే బాగుండేది. పూరి జగన్నాథ్ కొడుకు నటించిన ఓ సినిమాకు ప్రభాస్ ఇంటర్వ్యూ చేసాడు. అలాంటి ఎన్టీఆర్ ఇప్పుడు సందీప్ రెడ్డి వంగాతో ఇంటర్వ్యూ చేయడానికి కారణం ఏంటో ఆయనకే తెలియాలి. కపిల్ శర్మ షో విషయానికి వస్తే… ఎన్టీఆర్ ను కమెడియన్ చేసారు అక్కడ. ఆ ప్రోమో చూస్తేనే అర్ధమవుతుంది. ఎన్టీఆర్ రేంజ్ కు ఆ ప్రోమో ఏ మాత్రం సెట్ కాలేదు.

మన తెలుగు వాళ్లకు ఇప్పుడు బాలీవుడ్ లో గౌరవం పెరిగింది. అలాంటి ఎన్టీఆర్ ను కమెడియన్ గా చూపించినట్టే ఉంది అక్కడ. ఇక తెలుగులో సిద్దు, విశ్వక్‌లతో ఎన్టీఆర్, కొరటాల ఇంటర్వ్యూను చేసారు. ఎన్టీఆర్ రేంజ్ కి ఆ ఇద్దరు చిన్న హీరోలకు సంబంధం ఏమైనా ఉందా…? ఇక నార్త్ లో ఓ రేంజ్ లో హైప్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అలియా భట్, కరణ్ జోహార్ ఈ సినిమాను ప్రమోట్ చేస్తున్నారు. వాళ్ళ ఇద్దరికీ ఏ సంబంధం లేదు ఈ సినిమాతో. అసలు ఇప్పటి వరకు దేవర సినిమా ప్రమోషన్స్ అన్నీ కూడా సంబంధం లేని వ్యక్తులతో ఎన్టీఆర్ స్థాయి కంటే తక్కువ ఉన్న వ్యక్తులతోనే జరిగాయి అనే విషయం క్లియర్ గా అర్ధమవుతుంది. దేవర హిట్ అయితే ఎన్టీఆర్ స్థాయి పెరుగుతుంది. కాని ప్రమోషన్స్ తో పరువు తీసుకోవడం కరెక్ట్ కాదు అంటున్నారు జనాలు.