Thalapathy Vijay: తమిళగ వెట్రి కళగం పేరుతో దళపతి విజయ్ కొత్త పార్టీ..

విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని, పార్టీ పెడతాడని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై విజయ్.. ఎప్పుడూ స్పందించలేదు. అయితే, అందరూ అనుకున్నట్లుగానే రాజకీయపార్టీ స్థాపించారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది.

  • Written By:
  • Publish Date - February 2, 2024 / 02:04 PM IST

Thalapathy Vijay: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ కొత్త పార్టీ స్థాపించారు. ఈ మేరకు శుక్రవారం తన పార్టీ పేరును ప్రకటించారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీ ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని విజయ్.. తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా వెల్లడించారు. విజయ్ రాజకీయాల్లోకి వస్తాడని, పార్టీ పెడతాడని చాలా కాలం నుంచి ప్రచారం జరుగుతోంది. ఈ అంశంపై విజయ్.. ఎప్పుడూ స్పందించలేదు. అయితే, అందరూ అనుకున్నట్లుగానే రాజకీయపార్టీ స్థాపించారు.

Poonam Pandey: చనిపోవడానికి గంటల ముందు పార్టీ.. కన్నీళ్లు పెట్టిస్తోన్న పూనమ్‌ చివరి పోస్ట్‌..

లోక్‌సభ ఎన్నికలకు ముందు విజయ్ పార్టీ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే, రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ పోటీ చేయడం లేదని, అలాగే ఏ పార్టీకి మద్దతు ఇవ్వడం లేదని కూడా విజయ్ తెలిపారు. 2026లో జరిగే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తానని చెప్పారు. కొంతకాలంపాటు సినిమాలకు తాత్కాలిక విరామం ప్రకటిస్తానన్నారు. లోకేష్ కనకరాజ్‌తో చేయబోయే సినిమానే చివరిదని తెలిపారు. “తమిళనాడులో అవినీతి పాలన కొనసాగుతోంది. అవినీతికి వ్యతిరేకంగా పోరాడేందుకు నేను రాజకీయాల్లోకి వచ్చాను. తమిళ ప్రజలు మార్పు కోరుకుంటున్నారు. సామాజిక, రాజకీయ, ఆర్థిక సంస్కరణలు రాజకీయ అధికారంతోనే సాధ్యం. అవినీతి, విభజన రాజకీయాలు మన ఐక్యత, ప్రగతికి అవరోధాలు” అని విజయ్ అన్నారు. విజయ్.. తమిళనాడులో పెద్ద స్టార్ అనే సంగతి తెలిసిందే. తమిళంతోపాటు తెలుగు, ఇతర భాషల్లోనూ ఆయన సినిమాలకు మంచి ఆదరణ ఉంది.

రజనీకాంత్ తర్వాత ఆ రేంజ్ ఫాలోయింగ్ సంపాదించుకుంది విజయ్ మాత్రమే. ఆయనను అభిమానులు ముద్దుగా దళపతి అని పిలుచుకుంటారు. విజయ్.. కొంతకాలంగా సేవా కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు ప్రోత్సాహకాలు అందిస్తున్నారు. రాజకీయ పార్టీ ఏర్పాటు గురించి ఇటీవల విజయ్.. తన అభిమాన సంఘాలతో సమావేశమయ్యారు. అనంతరం రాజకీయ పార్టీ స్థాపించేందుకు సిద్ధమయ్యారు.