తంగలాన్ రివ్యూ: ఆ బానే ఉందిలే, ఒకసారి చూడొచ్చు

  • Written By:
  • Publish Date - August 15, 2024 / 06:01 PM IST

తమిళ స్టార్ హీరో విక్రం సినిమా అనగానే మన తెలుగు జనాల్లో ఓ రేంజ్ లో క్రేజ్ ఉంటది. ప్రతీసారి ఒక కొత్త కథతో నటనకు ప్రాణం పెడుతూ సినిమాలు చేసే ఈ హీరో ఇప్పుడు తంగలాన్ అనే కొత్త కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆగస్ట్ 15 సందర్భంగా వచ్చిన ఈ సినిమా… మన తెలుగు ప్రేక్షకులను ఎంత వరకు ఆకట్టుకుంది, కథలో పట్టు ఎలా ఉంది, నటన ఎలా ఉంది…? అసలు సినిమా పరిస్థితి ఏంటో చూద్దాం.

ట్రైలర్ తో ఒక డిఫరెంట్ ఫీల్ క్రియేట్ చేసిన చిత్ర యూనిట్… సినిమాతో మాత్రం “చూసింది చాల్లే” అన్న ఫీల్ మాత్రం కలిగించింది ప్రేక్షకులకు. బ్రిటీష్ వాళ్ళు మన దేశాన్ని పరిపాలించే సమయం… అంటే 1850 లో కథ ఇది. ఒక ఇంగ్లీష్ దొరతో కలిసి హీరో వెళ్ళాల్సిన పరిస్థితి. ఆ ప్రయాణంలో ఎన్నో వింత అనుభవాలు ఎదుర్కొంటాడు. బంగారం కనిపెట్టడం కోసం ఈ ప్రయాణం మొదలవుతుంది. అరణ్య, ఆరతి అనే ఇద్దరితో కలిసి బంగారం వెతికే ప్రయత్నం చేస్తాడు. ఈ బంగారం వెతికేది కాస్తో కూస్తో కేజిఎఫ్ తరహాలో ఉంటుంది.

సినిమా మొదట్లో కాస్త బాగుందని అనిపించినా ఆ ఫీల్ సినిమా మొత్తం కొనసాగించడంలో దర్శకుడు ఫెయిల్ అయ్యాడు. సినిమాలో ఒక్క సీన్ కు కూడా ప్రేక్షకులు కనెక్ట్ కాలేకపోతారు. సినిమా కాన్సెప్ట్ కొత్తగా ఉంది, హీరోని చూపించిన విధానం ఇంకా కొత్తగా ఉంది. కాని ఎక్కడో 18 వ శతాబ్దంలో మొదలైన కథ చివరికి 5 వ శతాబ్దం దగ్గరకు వెళ్లి ఆగిపోతుంది. ప్రేక్షకుల్లో కలిగిన ఆసక్తిని కొనసాగించడంలో దర్శకుడు బాగా ఫెయిల్ అయ్యాడు. హీరోకి ఇంగ్లీష్ ఎందుకు వస్తుందో కూడా అర్ధం కాదు జనాలకు. అయితే కుల వివక్ష, వర్ణ వివక్షకు సంబంధించిన సీన్లను బాగా చూపించారు.

ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలు మాత్రమే ఆకట్టుకున్నాయి. హీరో నటన మాత్రమే సినిమాకు హైలెట్ అయింది. విక్రం లేకపోతే ఆ పాత్రకు ఎవరూ సూట్ కారు. సినిమా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఓ రేంజ్ లో ఉంది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. టెక్నికల్ గా చాలా మంచి సినిమా అయినా… కథ పరంగా మాత్రం సినిమా రాడ్. కాని డిఫరెంట్ మూవీస్ చూడాలనుకునే వాళ్లకు ఈ సినిమా మంచి చాయిస్. విక్రం కోసం సినిమా చూడవచ్చు. మన రెండు తెలుగు సినిమాల కంటే ఈ సినిమా బెటర్ అనే చెప్పాలి. సినిమా కోసం అందరూ కష్టపడినా లాగ్ ఉండటంతో ప్రేక్షకులకు ఎక్కలేదు.