Pushpa2 : పుష్ప‌-2 సీక్వెన్స్‌లో ఆ సాలిడ్ ప‌ర్స‌నాలిటీ

పాన్ ఇండియా (Pan India) మూవీ పుష్ప-2కోసం అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులతో పాటు.. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్-1 కంట్రీ వైడ్‌గా దుమ్ము రేప‌డంతో పాటు.. బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది.. పుష్ప‌రాజ్‌ (Pushparaj) గా బ‌న్నీ యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు విప‌రీతంగా క‌నెక్ట్ అయ్యారు..

 

 

 

పాన్ ఇండియా (Pan India) మూవీ పుష్ప-2కోసం అల్లు అర్జున్ (Allu Arjun) అభిమానులతో పాటు.. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. పుష్ప పార్ట్-1 కంట్రీ వైడ్‌గా దుమ్ము రేప‌డంతో పాటు.. బాక్సాఫీస్ రికార్డులు బ‌ద్ద‌లు కొట్టింది.. పుష్ప‌రాజ్‌ (Pushparaj) గా బ‌న్నీ యాక్టింగ్‌కు ప్రేక్ష‌కులు విప‌రీతంగా క‌నెక్ట్ అయ్యారు.. త‌గ్గేదే లే అన్న అల్లు అర్జున్ మేన‌రిజానికి వ‌ర‌ల్డ్ వైడ్‌గా హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది.. అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న్న స్టెప్స్ ఎంత‌గానో ఫేమ‌స్ అయ్యాయి. పుష్ప‌రాజ్‌గా యాక్టింగ్‌కు గాను బ‌న్నీ ఏకంగా నేష‌న‌ల్ అవార్డును ప‌ట్టేసాడు.

దీంతో.. పుష్ప‌-2 (Pushpa-2) పై అంచనాలు భారీగా పెరిగాయి. దానికి త‌గ్గ‌ట్లుగానే ఎక్కడా తగ్గేదే లే అంటూ డైరెక్టర్ సుకుమార్ ఓ రేంజ్‌లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి ఉన్న క్రేజ్ కార‌ణంగా.. ఈ సినిమా నుంచి ఏ చిన్న అప్‌డేట్ వ‌చ్చినా అది ఓ రేంజ్‌లో వైర‌ల్‌గా మారుతోంది. ఇప్పుడు పుష్ప‌-2 ఇంట‌ర్వెల్ ఎపిసోడ్‌కు చెందిన మ‌రో లేటెస్ట్ అప్‌డేట్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తోంది. గత కొన్నాళ్ల నుంచి ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ జాతర సీక్వెన్స్ కోసం విప‌రీత‌మైన చ‌ర్చ న‌డుస్తోంది.

ఇప్పటివరకు ఎటువంటి సినిమాలో లేనంత విధంగా ఇంటర్వెల్ సీన్ చిత్రీకరిస్తున్నారట.. ఇంటర్వెల్ సీన్ లోనే జాతరకు సంబంధించిన సీన్స్ ఉండబోతున్నాయట‌.. కేవలం ఆ ఒక్క ఎపిసోడ్ కోసం మేక‌ర్స్ ఏకంగా 50 కోట్ల రూపాయల‌ను ఖ‌ర్చు చేస్తున్న‌ట్లు వినిపించిన టాక్ సోష‌ల్ మీడియాను షేక్ చేసింది. అల్లు అర్జున్ అర్ధ నారీశ్వరి అవతారంలో.. విలన్స్ ను చీల్చి చెండాడడమే కాకుండా ఉగ్రరూపంతో వేసిన స్టెప్పులు ఆడియ‌న్స్‌కు గూస్‌బంప్స్ తెప్పిస్తాయంటూ మూవీపై హైప్‌ణు పెంచేస్తున్నారు. సుకుమార్ ఆ ఎపిసోడ్‌ను ఏ రేంజ్‌లో తీర్చిదిద్దుతున్నాడో అని ఫ్యాన్స్ అంచ‌నాలు వేస్తున్నారు. కాగా.. ఇంట‌ర్వెల్ ఎపిసోడ్‌కు సంబంధించిన ఇప్పుడు మ‌రో లేటెస్ట్ బ‌జ్ ఇప్పుడు వైర‌ల్‌గా మారింది.

ఇంట‌ర్వెల్ ఎపిసోడ్‌లో సుకుమార్ చాలా స‌ర్‌ప్రైజ్‌లు ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ మాత్రమే కాకుండా.. రష్మిక కూడా కనిపిస్తుంది అన్న‌ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీళ్లిద్ద‌రి పెర్ఫామెన్స్ నెక్స్ట్ లెవెల్లో హైలైట్ అవుతుంది అని గట్టి టాక్ వినిపిస్తోంది. ఈ ఎపిసోడ్‌లో ర‌ష్మిక కాకున్నా.. బ‌న్నీతో పాటుగా మ‌రో సాలిడ్ ప‌ర్స‌నాలిటీ మాస్ జాత‌ర చేయ‌డం ఖాయ‌మంటున్నారు. ఈ ఒక్క సీక్వెన్స్ పుష్ప‌-2 ను నెక్స్ట్ లెవ‌ల్‌కు తీసుకెళ్తాయ‌ని చెబుతున్నారు. ఇప్ప‌టి నుంచి ఇంత క్యూరియాసిటీని పెంచేస్తున్న ఈ హై ఓల్టేజ్ సీక్వెన్స్ ఈ సినిమాకు ఎలాంటి రిజ‌ల్ట్ అందిస్తుందో చూడాలి మ‌రి..