బాలీవుడ్ (Bollywood) టాప్ హీరో అమీర్ ఖాన్ (Aamir Khan) గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు.. ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీకి (Indian Film Industry) ఎన్నో మెమొరబుల్ చిత్రాలు అందించాడు. ఖాన్ ల త్రయంలోనే ఎదురేలేని హీరోగా రాణించాడు. తన ఎక్స్‌పెరిమెంటల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని, ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నాడు. హీరోగానే కాదు.. నిర్మాతగానూ సూపర్ సక్సెస్ అయ్యాడు. రీసెంట్‌గా 59వ ఏట అడుగు పెట్టిన ఈ స్టార్ హీరో ఇప్పటికీ తన ఫిట్‌నెస్‌తో అమ్మాయిల హృదయాలను కొల్లగొడుతున్నాడు. వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు గట్టి పోటీ ఇస్తున్నాడు.. అందుకే అమీర్‌ఖాన్‌ను బాక్సాఫీస్ లెజెండ్ గా గౌరవిస్తారు. నిజానికి 100 కోట్లు,200 కోట్ల క్లబ్, 300 కోట్ల క్లబ్‌ను కూడా రీచ్ అయిన మొదటి భారతీయ హీరోగా అమీర్ రికార్డులకెక్కాడు. మార్చి 14 అమీర్ బర్త్‌డే సందర్భంగా ఆయన కెరీర్‌తో పాటు ఆస్తుల వివరాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముప్పై ఏళ్ల తన సినీ కెరీర్‌లో అమీర్ కూడబెట్టిన ఆస్తులు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి.
నటన, చిత్ర నిర్మాణం, బ్రాండ్ ప్రమోషన్స్, వివిధ పెట్టుబడుల ద్వారా అమిర్ కూడబెట్టిన ఆస్తుల విలువ ఎంతో తెలిస్తే ఎవరైనా నోళ్లు వెళ్లబెట్టాల్సిందే.. ప్రస్తుతం అమీర్ ఆస్తుల విలువ అక్షరాల 1862 కోట్లు అట.. అమీర్ ఖాన్‌కు లాస్ ఏంజెల్స్‌లో రూ.75 కోట్ల విలువైన మాన్షన్ హౌస్ ఉంది.. ఇది ఏమీ చిన్న విషయం కాదు.. ఎందుకంటే ఈ ప్రాంతంలో చాలా మంది ప్రముఖులకు నివాసాలు ఉన్నాయి. ముంబైలోని బాంద్రాలో అమీర్ ఖాన్ కు ఓ ఇల్లు ఉంది. 5000 చదరపు అడుగుల విస్తీర్ణం, రెండు అంతస్తులతో ఉంది. దీని ధర దాదాపు 60 కోట్ల రూపాయలు. అలాగే అమీర్ ఖాన్ కి కార్లంటే పిచ్చి. అతనికి చాలా కార్లు ఉన్నాయి. వీటిలో చాలా లగ్జరీ కార్లు ఉన్నాయి. అతనికి రోల్స్ రాయిస్ ఘోస్ట్ ఉంది. దీని ధర దాదాపు 7-8 కోట్ల రూపాయలు. అమీర్ ఖాన్‌కు మెర్సిడెస్ బెంజ్ ఎస్600 కారు ఉంది. ఈ కారు ధర 10.50 కోట్లు. ఈ కారు చాలా విలాసవంతమైనది.
చాలా మంది సెలబ్రిటీలకు సొంతంగా ఫామ్‌హౌస్ క్రేజ్ ఉంటుంది. అదే విధంగా, అమీర్ ఖాన్‌కు పొంచగనిలో 2 ఎకరాల ఆస్తి ఉంది. దీని ధర 7 కోట్ల రూపాయలు. సమయం దొరికినప్పుడు ఇక్కడికి వెళ్లిపోతాడు. ఈ భూమిని పొందే సమయంలో స్టాంప్ డ్యూటీ కింద 42 లక్షలు చెల్లించాడు మరి.. అయితే.. ఇన్ని వేల కోట్లకు అధిపతి అయినప్పటికీ.. ఈ హీరో చాలా సింపుల్‌గా ఉండడం అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఉంటుంది. కాగా.. తన కుమార్తె కూతురు ఐరా ఖాన్ వివాహాన్ని చాలా ఘనంగా జరిపించాడు అమీర్ ఖాన్.. ఇక ఇప్పుడు తన తదుపరి సినిమాలతో బిజీ గా మారిపోయాడు. లాల్ సింగ్ జద్దా డిజాస్టర్ తర్వాత తన సినిమాలపై ఫోకస్ చేస్తున్నాడు. తన బ్లాక్ బస్టర్ మూవీ తారే జమీన్ పార్ సీక్వెల్ తో కంబ్యాక్ కోసం సిద్ధమవుతున్నాడు. త్వరలోనే తన కొత్త సినిమాలపై కూడా అధికారిక ప్రకటన రాబోతోంది. ముప్పై సంవత్సరాలుగా తనదైన స్పెషల్ మూవీస్‌తో ప్రేక్షకులను అలరించిన అమీర్ ఖాన్.. ఫ్యూచర్ లో మరిన్ని డిఫరెంట్ మూవీస్‌తో అలరించాలని ఫ్యాన్స్‌తో పాటు ఫిలిం ఇండస్ట్రీ కూడా కోరుకుంటోంది.