SSMB29 : SSMB29 స్టార్ట్ అయ్యేది అప్పుడే

అసలు జక్కన్న (Jakkanna) ఏం ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు (Mahesh Babu) తో జరుగుతున్న చర్చ ఏంటి లుక్ ఫైనల్ చేశాడా

అసలు జక్కన్న (Jakkanna) ఏం ప్లాన్ చేస్తున్నాడు మహేష్ బాబు (Mahesh Babu) తో జరుగుతున్న చర్చ ఏంటి లుక్ ఫైనల్ చేశాడా హీరోయిన్ ఎవరు విలన్ ఎవరు బడ్జెట్ ఎంత హాలీవుడ్ (Hollywood) స్టార్స్ నటిస్తున్నారా అసలెప్పుడు ఎస్ఎస్ఎంబీ 29 (SSMB 29) స్టార్ట్ కానుంది ప్రజెంట్ జక్కన్న ఏం చేస్తున్నాడు అనే విషయాలన్నీ కూడా ప్రస్తుతానాకి సస్సెన్స్‌గానే ఉన్నాయి.

మధ్యలో ఫలానా అంటూ లీకులు వస్తున్నప్పటికీ.. రాజమౌళి చెప్పేవరకు ఏ విషయాన్ని కూడా నమ్మేలా లేదు. కానీ ఈ సినిమాను హాలీవుడ్‌ ప్రాజెక్ట్‌గానే టేకప్ చేయడానికి గ్రౌండ్ వర్క్ చేస్తున్నాడు దర్శక ధీరుడు. ఇప్పటికే ఓ హాలీవుడ్ ఏజెన్సీతో ఒప్పందం కుదుర్చుకున్నాడని వార్తలు వచ్చాయి. అలాగే అన్‌లిమిటేడ్ బడ్జెట్‌తో ఈ సినిమా రానుందని మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. అంటే.. వెయ్యి కోట్లైనా పెట్టడానికి రెడీగా ఉన్నారు. ఇండియానా జోన్స్ రేంజ్ సినిమా కాబట్టి.. ఎంతైనా పెట్టాల్సిందే.

అయితే.. ఈ సినిమాను రాజమౌళి అధికారికంగా ప్రకటిస్తే చూడాలని, ఘట్టమనేని అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు చేసినా.. ఆరోజు మాత్రం సంచలనమేనని అంటున్నారు. చెప్పాలంటే.. సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న ఈ ప్రాజెక్ట్ అనౌన్స్మెంట్ ఉంటుందని అన్నారు. కానీ అసలు ఆరోజు ఎస్ఎస్ఎంబీ 29 కనీసం సోషల్ మీడియాలో కూడా సౌండ్ చేయలేదు. కానీ మరో రెండు నెలల్లో మాత్రం రాజమౌళి ర్యాంపేజ్ స్టార్ట్ కానుందని అంటున్నారు. ఈ సినిమాను ఆగస్టులో మొదలు పెట్టె అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. మహేష్‌ బాబు బర్త్ డే సందర్భంగా ఆగష్టు 9న ప్రకటన ఉంటుందని.. అదే నెల చివర్లో సెట్స్ పైకి వెళ్లొచ్చు అని టాక్ వస్తోంది. ఈలోపు ప్రీ ప్రొడక్షన్ వర్క్ కంప్లీట్ చేయనున్నాడు రాజమౌళి. మరి ఈసారైనా ఈ సినిమా ప్రకటన ఉంటుందేమో చూడాలి