Samantha : ఆయ‌న‌తో బంధం ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే

స‌మంత రూత్ ప్ర‌భు... ఇది ఒక పేరు మాత్ర‌మే కాదు. ఒక బ్రాండ్‌. . ఒక సెన్సేష‌న్ కూడా.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే నైజం ఉన్న సెల‌బ్రిటీగా పేరున్న ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్ర‌మే కాదు.. నెగ‌టివిటీ కూడా అదే రేంజ్‌లో ఉంది.

 

 

 

స‌మంత రూత్ ప్ర‌భు… ఇది ఒక పేరు మాత్ర‌మే కాదు. ఒక బ్రాండ్‌. . ఒక సెన్సేష‌న్ కూడా.. ఉన్న‌ది ఉన్న‌ట్లుగా మాట్లాడే నైజం ఉన్న సెల‌బ్రిటీగా పేరున్న ఈ బ్యూటీకి సోష‌ల్ మీడియాలో ఫాలోయింగ్ మాత్ర‌మే కాదు.. నెగ‌టివిటీ కూడా అదే రేంజ్‌లో ఉంది. నాగ చైత‌న్య‌తో పెళ్లి విడాకుల‌తో సామ్ పేరు సోష‌ల్ మీడియాలో ఎక్కువ కాలం మార్మోగిపోయింది. ఆ త‌ర్వాత హెల్త్ రీజ‌న్స్ కార‌ణంగా స‌మంత సినిమాల‌కు కొద్ది రోజులు బ్రేక్ తీసుకుంది. వెకేష‌న్స్ ఎంజాయ్ చేసింది. ఆ టైమ్‌లో కూడా ఫొటోలు, వీడియోలతో త‌న ఫ్యాన్స్‌తో ట‌చ్‌లోనే ఉంది. ప్రస్తుతం సిటాడెల్ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే పనిలో ఉంది. అయితే.. రీసెంట్‌గా సామ్.. ఆయ‌న‌తో బంధం ఎప్పుడూ ప్ర‌త్యేక‌మే అంటూ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. స‌మంత ఈ కామెంట్స్ ఎవ‌రి కోసం చేసింది అంటూ నెటిజ‌న్లు తెగ చ‌ర్చించేసుకుంటున్నారు.

స‌మంత రియ‌ల్ లైఫ్‌లో స్నేహానికి ఎంత వేల్యూ ఇస్తుందో అంద‌రికీ తెలిసిన విష‌య‌మే.. ముఖ్యంగా చిన్న‌యి, రాహుల్ ర‌వీంద్రన్, వెన్నెల కిషోర్‌తో స‌మంత‌కు ఉన్న ఫ్రెండ్‌షిప్ ఎంత స్పెష‌ల్ అన్న విష‌యం ప్ర‌పంచం మొత్తానికి తెలుసు. చైత‌న్య‌తో విడాకుల స‌మ‌యంలో నెగిటివిటీని ఎదుర్కొన్న స‌మ‌యంలో స‌మంత తన లైఫ్ లో ప్రేమ, పెళ్లి కన్నా.. స్నేహాన్నే ఎక్కువ‌గా న‌మ్మిన‌ట్లుగా వాళ్ల బంధాన్ని చూసిన వాళ్ల‌కి అనిపించింది.. ఇది నిజం అనిపించేలా రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో త‌న స్నేహ‌బంధం ఎంత గొప్ప‌దో తెలిసేలా స‌మంత మ‌రోసారి కామెంట్స్ చేసింది. ఓ ఫ్రెండ్‌గా రాహుల్ ను తాను ఎంత గొప్ప‌గా న‌మ్ముతుందో ఓ వీడియోలో చెప్పుకొచ్చింది.

చిన్మయి హోస్ట్ చేస్తున్న ఓ ప్రోగ్రామ్ కు అటెండ్ అయిన సామ్.. ఆమె చూపించిన గ్రూప్ ఫొటో చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యింది. ఆ గ్రూప్ ఫొటోలో వెన్నెల కిశోర్, రాహుల్ తో పాటు చిన్మయి, స‌మంత కూడా ఉన్నారు. ఈ పిక్ చూసి ఎమోష‌న‌ల్ అయిన సామ్.. తాను ఎంతో ఎక్కువ‌గా న‌మ్మే వ్య‌క్తి రాహుల్ అని చెప్పింది.. తాను ఎవరినైనా మ‌ర్డ‌ర్ చేసినా స‌రే రాహుల్‌తో చెప్పేస్తాన‌ని చెప్పించి.. రాహుల్ త‌న‌ను జ‌డ్జి చేయ‌డ‌ని.. చాలా న‌మ్మ‌కంగా ఉంటాడ‌ని.. ఆయ‌న‌తో త‌న బంధం ఎప్ప‌టికీ అలాగే ఉంటుంద‌ని చెప్పుకొచ్చింది. స‌మంత చేసిన ఈ కామెంట్స్ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. గొప్ప ఫ్రెండ్‌షిప్ అని కొంద‌రు. మీ ఫ్రెండ్‌షిప్ క‌ల‌కాలం ఇలాగే ఉండాల‌ని కొంద‌రు కామెంట్లు పెడుతున్నారు..