పుష్ప పార్ట్ 1 (Pushpa 1) తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అల్లు అర్జున్ (Allu Arjun), సుకుమార్ (Sukumar) కాంబో.. ఈసారి పార్ట్ 2తో వెయ్యి కోట్లు టార్గెట్‌గా పెట్టుకున్నారు. ఆగస్ట్ 15న రిలీజ్ కానున్న పుష్ప2 (Pushpa 2) కోసం మూవీ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ ఆడియెన్స్.. పుష్పరాజ్ థియేటర్లోకి రావడమే లేట్ అన్నట్టుగా ఉన్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పుష్ప2 టీజర్, పుష్ప పుష్ప సాంగ్, కపుల్ సాంగ్ అంచనాలను పెంచేశాయి.
ఇక ఈ చిత్రం షూటింగ్ చాలా భాగం పూర్తి అయ్యింది. ప్రస్తుతం క్లైమాక్స్‌కు సంబంధించిన సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ కీలక ఎపిసోడ్‌ను చాలా పకడ్బందీగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఎందుకంటే.. పుష్ప3కి లీడ్ ఇచ్చే సీన్లు కూడా తెరకెక్కిస్తున్నట్టుగా టాక్ ఉంది. అందుకే.. సెట్ నుంచి ఎలాంటి లీలులు జరగకుండా.. జాగ్రత్తలు తీసుకుంటున్నారట.
ఈ నేపథ్యంలో సుకుమార్ (Sukumar) కీలక నిర్ణయం తీసుకున్నాడట. చిత్ర యూనిట్‌కి స్ట్రిక్ కండిషన్ పెట్డాడట. ఈ చిత్రానికి పని చేస్తున్న ప్రతి టెక్నిషియన్ షూటింగ్ స్పాట్‌కు మొబైల్ తీసుకురాకూడదు.. అని ఆదేశించినట్టుగా సమాచారం. యూనిట్ సభ్యులు కమ్యూనికేషన్ కోసం వాకీ టాకీలను మాత్రమే ఉపయోగించనున్నారట. ఎట్టి పరిస్థితుల్లోను క్లైమాక్ షూట్ పిక్స్ రివీల్ కాకూడదనే ఉద్దేశంతో ఇలాంటి రూల్ పెట్టినట్లు సమాచారం. గతంలో పుష్ప2 నుంచి చాలా లీకులు వచ్చాయి. కానీ క్లైమాక్స్ కోసం కండీషన్స్ అప్లై అంటున్నారంటే.. ఈ సీక్వెన్స్ ఎలా ఉండబోతుందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈసారి పుష్పరాజ్ ఏం చేస్తాడో చూడాలి.