ఇక ఆదిపురుష్ టీం యూఎస్ లో తప్ప మరెక్కడ ప్రమోషన్ చేయట్లేదనుకుంటున్నారుకాని, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్ల వ్యవస్తతో టీ సీరీస్ టీం గట్టి ప్లానింగే చేసింది. ఆ వివరాల ప్రకారం ఆదిపురుష్, తమిళ నాడు నుంచి 100 కోట్లు, కేరళా నుంచి 50, కర్ణాటక నుంచి 90 కోట్లు కలెక్ట్ అయ్యలా థియేటర్స్ ని ఫాలో అప్ చేస్తోంది.
ఇక నార్త్ ఇండియాలోనే 550 కోట్లకు పైగా వసూళ్లు వస్తాయనే అంచనాలున్నాయి. అలా ఇండియాలో 11 వందలకోట్లు వచ్చేలా ఉంది. ఇక యూఎస్ మార్కెట్ తోపాటు యూకే, ఆస్ట్రేలియా ఇలా విదేశాల్లో 400 కోట్లు కలెక్ట్ చేయొచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. సో శాటిలైట్, డిజిటల్ రైట్స్ తో కలిపి 2000 కోట్లని టార్గెట్ చేసింది ఆదిపురుష్ టీం. ఇదే జరిగితే బాహుబలి 2 రికార్డు బద్దలై, దంగల్ రికార్డుని రీచ్ అవుతుంది ఈ సినిమా.