social media : మహేష్ దుర్గారావుని కూడా వదల్లేదు..

సోషల్ మీడియా ప్రభావం స్టార్ హీరోల సినిమాలపై కూడా గట్టిగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాటలని, మాటలని సినిమాల్లో పెట్టేస్తున్నారు. 'కేసీపీడీ' అనే డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి 'గాడ్ ఫాదర్' సినిమాలో ఉపయోగించారు..

సోషల్ మీడియా ప్రభావం స్టార్ హీరోల సినిమాలపై కూడా గట్టిగా ఉంటుంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పాటలని, మాటలని సినిమాల్లో పెట్టేస్తున్నారు. ‘కేసీపీడీ’ అనే డైలాగ్ ను మెగాస్టార్ చిరంజీవి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఉపయోగించారు. అలాగే సోషల్ మీడియాని ఒక ఊపు ఊపిన ‘జంబలకడి జారు మిఠాయా’ పాటను ‘వాల్తేరు వీరయ్య’లో పాడి అలరించారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా అదే బాటలో పయనిస్తున్నారు. ఒకే సినిమాలో మాస్ జాతర చూపిస్తున్నారు.

సంక్రాంతి కానుకగా జనవరి 12న మహేష్ నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ విడుదల కానుంది. అయితే మాస్ ని, యూత్ ని మెప్పించేలా సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ని ఈ సినిమాలో గట్టిగా వాడుతున్నారు. ఇప్పటికే ‘కుర్చీని మడతపెట్టి’ డైలాగును ఒక పాటలో ఉపయోగించారు. అలాగే సినిమాలో మరో సర్ ప్రైజ్ ఉందట.

‘పలాస’ సినిమాలోని ‘నక్కిలీసు గొలుసు’ పాట పెద్ద హిట్ అయింది. ముఖ్యంగా ఈ పాటకు దుర్గారావు, అతని భార్య వేసిన డ్యాన్స్ స్టెప్పులు సోషల్ మీడియాని ఒక ఊపు ఊపాయి. బుల్లితెరను కూడా ఈ స్టెప్పులు షేక్ చేశాయి. ఇప్పుడు వెండితెరపైకి, అందునా సూపర్ స్టార్ సినిమాలో కనువిందు చేయనున్నాయట. హీరోయిన్ శ్రీలీలతో కలిసి మహేష్ ‘నక్కిలీసు గొలుసు’ పాటకు చిందేశాడట. ఈ స్టెప్పులు మాస్ ని ఒక ఊపు ఊపడం ఖాయమని అంటున్నారు.