The Kerala Story: తమిళనాడులో ది కేరళ స్టోరీ బ్యాన్‌.. సినిమాలో అసలేముంది..

తమిళనాడులో ది కేరళ స్టోరీ సినిమా కాకరేపుతోంది. సినిమాను బ్యాన్‌ చేయాలంటూ పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తడంతో.. సినిమా షోస్‌ను రద్దు చేశారు. చెన్నై, కోయంబత్తూర్, మదురై, సేలంతో పాటు అన్ని మెయిన్‌ సిటీస్‌లోని మల్టీప్లెక్స్‌లలో సినిమా షోస్‌ నిలిపివేశారు.

  • Written By:
  • Publish Date - May 7, 2023 / 02:00 PM IST

తమిళనాడులోనే కాకుండా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది ది కేరళ స్టోరీ సినిమా. ఈ సినిమా గురించి ప్రధాని నరేంద్ర మోదీ కూడా మాట్లాడటంతో ఒక్కసారిగా హాట్‌ టాపిక్‌గా మారింది. లవ్‌ జిహీదీ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ది కేరళ స్టోరీని సుదీప్తో సేన్‌ డైరెక్ట్‌ చేశారు. కేరళలో 32 వేల మంది అమ్మాయి మిస్‌ అవ్వడానికి లవ్‌ దిహీదీ కారణం అన్నట్టుగా సినిమాలో చూపించారు.

ముస్లిం అబ్బాయిల ప్రేమలో పడి ఐసిస్‌లో చేరిన నలుగురు కేరళ అమ్మాయిలు మాతృ దేశంతో పాటు ప్రపంచ దేశాలపై ఎలాంటి ఉగ్ర కార్యకలాపాలు చేశారనే పాయింట్‌తో సినిమా నడుస్తుంది. రాజకీయంగా కూడా ఈ సినిమా ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఓట్‌బ్యాక్‌ కోసం సినిమాను అనుకూలంగా వాడుకుంటున్నారంటూ కాంగ్రెస్‌ విమర్శిస్తోంది. ముస్లింలను దేశ విద్రోహశక్తులుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్‌ ఓవైసీ సీరియస్‌ అయ్యారు. అటు కేరళ సీఎం పినరయి విజయన్‌ కూడా సినిమాను బ్యాన్‌ చేయాలన్నారు.

కేరళను ఉగ్ర కార్యకలాపాలకు అడ్డాగా చూపించే ప్రయత్ని సినిమాలో జరిగిందన్నారు. ఇలాంటి సినిమాలను ఎవరూ ఎంకరేజ్‌ చేయొద్దన్నారు విజయన్‌. అప్పట్లో వచ్చిన ది కశ్మీర్‌ ఫైల్స్‌ సినిమా కూడా ఇదే స్థాయిలో చర్చనీశాంగా మారింది. కశ్మీర్‌లో హిందువులపై జరుగుతున్న అరాచకాలను బేస్‌ చేసుకుని వచ్చిన సినిమా కశ్మీర్‌ ఫైల్స్‌. మొత్తం ఇప్పుడు వచ్చిన కేరళ స్టోరీ కూడా అదే స్థాయిలో వివాదాలు ఫేస్‌ చేస్తోంది.