ఈ సినిమాను బ్యాన్ చేయాలంటూ చాలా స్టేట్స్‌లో ధర్నాలు రాస్తారోకోలు చేశారు. కొన్ని ప్రాంతాల్లో షోలు రద్దు చేశారు. ఇక వెస్ట్ బెంగాల్ లాంటి రాష్ట్రాలు మాత్రం సినిమాను ఏకంగా బ్యాన్ చేశాయి. ఈ విషయంలో సుప్రీం కోర్టు కూడా కలుగజేసుకుని షోలు వేయాలంటూ మొట్టికాయలు వేసింది. ఈ సినిమాను ఎంత ఆపాలని చూశారో సినిమా అంత దూసుకెళ్లింది. రీసెంట్‌గా రిలీజైన స్టాటిస్టిక్స్ ప్రకారం ది కేరళ స్టోరీ సినిమా 2 వందల కోట్లు కలెక్ట్ చేసింది.
సినిమా మీద కాంట్రవర్సీ పెరిగిన కొద్దీ ఆడియన్స్‌లో ఇంట్రెస్ట్ పెరిగింది. షోలు రద్దు చేసిన కొద్దీ టికెట్ బుకింగ్స్ పెరిగాయి. ఇండియా వైడ్‌గా అన్ని రాష్ట్రాల్లో ఆడియన్స్‌ను థియేటర్స్‌కు పరుగులు పెట్టించింది ది కేరళ స్టోరీ సినిమా. ఇంకా కలెక్షన్స్ కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. అంతే కాదు 200 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా కేరళ స్టోరీ రికార్డ్ క్రియేట్ చేసింది. సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా ఈ స్థాయిలో రికార్డ్ కొడుతుందని ఎవరూ ఊహించి ఉండరు. ఊహకందని రికార్డ్ క్రియేట్ చేసిన ది కేరళ స్టోరీ కలెక్షన్స్ మార్క్ ఇప్పుడు ఇంటర్నెట్లో హాట్ టాపిక్‌గా మారింది.