కాశ్మీర్ లో ఒకప్పడు జరిగిన అరాచకాలను చూపిస్తే, ఆ మూవీ బాలీవుడ్ లోనే టాప్ హిట్ గా నిలిచింది. హిందీ సినిమాలు ఫ్లాప్ అవుతున్న టైంలో ఒకే ఒక్క కాశ్మీరీ ఫైల్స్ పాన్ ఇండియా లెవల్లో వసూల్ల వర్షం తెచ్చింది. ఇప్పుడు ది కేరళా స్టోరీ అంతకుమించే వివాదంతో వస్తుంది.. ఇదెక్కడ ఆదిపురుష్, జవాన్ సినిమాలకు ముప్పుగా మారుతుందో అనే కంగారు బాలీవుడ్ బ్యాచ్ కి పెరిగింది.
సుదిప్తో సేన్ తీసిన ఈమూవీలో అదా శర్మ తప్ప మరో తెలిసిన ముఖం లేదు. ఐతే లవ్ జిహాద్ కాన్సెప్ట్ ని, 30 వేలకుపైనే హిందూ మహిళలను, ఇస్లాంలోకి మార్చరి ఐసిస్ టెర్రరిస్ట్ క్యాంప్ లకు తరలించారనే కథాంశం పెను వివాదంగా మారేలా ఉంది. ఆల్రెడీ కేరళలోని ముస్లిం సంఘాలు ఈ మూవీ కథ ప్రాపగాండా అంటోంది.. ఇది పెద్ద రాజకీయ వివాదంగా మారే ఛాన్స్ ఉండటంతో, ఇది ఎక్కడ ఆదిపురుష్, జవాన్ కి పోటీ అవుతుందో అనే కంగారు హిందీ ఫిల్మ్ మేకర్స్ కి పెరిగింది
ఎక్కడ ప్రభాస్, ఎక్కడ షారుఖ్ అలాంటి వాళ్లకు అది కూడా ఈ వారం వచ్చే ది కేరళా స్టోరీ ఎలా పోటీ అనే డౌటే అక్కర్లేదు. ది కాశ్మీరీ ఫైల్స్ ముందు ఎలా మిగతా హీరోల సినిమాలు ఓడిపోయాయోచూశాం. సో బాలీవుడ్ టైం బాలేదు. కాబట్టే ది కాశ్మీరీ ఫైల్స్ రిలీజైన నెలకి వచ్చే షారుక్ జవాన్, ప్రభాస్ ఆదిపురుష్ రెండీంటికి ఇబ్బంది తప్పదంటున్నారు. ఎంత ప్రభాస్ మూవీ అయినా ఆదిపురుష్ తీసింది హిందీ దర్శకుడే కాబట్టి, ఎలా చూసినా నార్త్ మార్కెట్ లో ది కేరళాస్టోరీ మిగతా హిందీ మూవీలకు షాక్ ఇచ్చేలా ఉంది.