The Kerala Story: ఓటీటీలోకి వచ్చేస్తున్న ‘ది కేరళ స్టోరీ’.. ఎప్పుడు.. ఎక్కడ స్ట్రీమింగ్..?

అనేక సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నప్పటికీ.. ది కేరళ స్టోరీ మాత్రం ఓటీటీలో విడుదల కాలేదు. దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఇప్పుడో గుడ్ న్యూస్. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.

  • Written By:
  • Updated On - February 6, 2024 / 08:01 PM IST

The Kerala Story: గత ఏడాది విడుదలై దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన చిత్రం ది కేరళ స్టోరీ. ఈ చిత్రం చుట్టూ బోలెడన్ని వివాదాలు చుట్టుముట్టినప్పటికీ బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్సం కురిపించింది. గత ఏడాది మే 5న విడుదలైన ఈ చిత్రం ఇంతవరకూ ఓటీటీలోకి రాలేదు. ఆ తర్వాత విడుదలైన అనేక సినిమాలు కూడా నెల రోజుల్లోనే ఓటీటీలోకి వస్తున్నప్పటికీ.. ది కేరళ స్టోరీ మాత్రం ఓటీటీలో విడుదల కాలేదు.

PAWAN KALYAN: ఓజీ రిలీజ్ డేట్ కన్ఫాం.. మరోసారి రికార్డులు ఖాయమా..?

దీంతో ఈ చిత్రం కోసం ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వారందరికీ ఇప్పుడో గుడ్ న్యూస్. ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఫిబ్ర‌వ‌రి 16 నుంచి ది కేరళ స్టోరీ.. జీ 5లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేర‌కు జీ5 సంస్థ ట్విట్ట‌ర్ ద్వారా ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. ఈ సినిమా మలయాళంతో పాటు తెలుగు, తమిళ్‌, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి రానున్నట్లు జీ5 వెల్లడించింది. సుదీప్తో సేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అదా శర్మ, యోగితా బిహాని కీలక పాత్రలు పోషించారు. రూ.35 కోట్లతో తీసిన ది కేరళ స్టోరీ ఏకంగా రూ.200 కోట్లు రాబ‌ట్టింది. కేర‌ళ‌లో కొంత‌మంది హిందూ అమ్మాయిల‌ను కొందరు యువకులు ల‌వ్ జిహాదీ పేరుతో మ‌తం మారుస్తున్నార‌నే అంశంపై ఈ చిత్రం రూపొందంది. దీంతో ఈ సినిమా అప్ప‌ట్లో వివాదాస్పదమైంది. ఒక వర్గాన్ని లక్ష్యంగా చేసుకుని, ఈ సినిమా తీశారని తీవ్ర విమర్శలొచ్చాయి.

దీంతో ప‌శ్చిమ‌బెంగాల్, తమిళనాడు వంటి కొన్ని రాష్ట్రాలు ఈ సినిమాపై నిషేధం విధించాయి. మరోవైపు ఈ సినిమాకు కొందరు మద్దతుగా నిలిచారు. దీంతో భారీగా ప్రచారం లభించి, మరింత మందికి చేరువైంది. బీజేపీ పాలిత రాష్ట్రాలు ఈ సినిమాకు పన్ను రాయితీ ప్రకటించాయి. బీజేపీయేతర రాష్ట్రాలు నిషేధం విధించాయి. కొన్ని థియేటర్ల యాజమాన్యాలు సినిమాను ప్రదర్శించబోమంటూ ప్రకటించారు. ఏదేమైనా.. ఇన్నాళ్లకు సినిమా ఓటీటీలోకి వస్తుండటంతో మూవీ లవర్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు.