The Kerala Story: కేరళ స్టోరీని బ్యాన్ చేయాల్సిన అవసరం ఏముంది.. సినిమా చుట్టూ ఎందుకీ రాజకీయం..

ట్రైలర్ తోనే వివాదాలు వెనకేసుకున్న కేరళ స్టోరీ సినిమాకు సుప్రీమ్ కోర్టులో ఊరట లభించింది. ఈ సినిమాను ఎందుకు బ్యాన్ చేశారంటూ సుప్రీమ్ కోర్టు వెస్ట్ బెంగాల్, తమిళనాడు ప్రభుత్వాలను ప్రశ్నించింది. వెంటనే రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. పిటిషనర్ అప్పీల్ విన్న తరువాత కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

  • Written By:
  • Publish Date - May 12, 2023 / 04:53 PM IST

దేశవ్యాప్తంగా ఈ సినిమా నడుస్తోంది కదా? బెంగాల్‌ ఈ సినిమాను ఎందుకు నిషేధించాలి? అని ప్రశ్నించింది. బ్యాన్‌కు గల కారణాలను చెప్పాలని ఆదేశించింది. ఈ మేరకు ది కేరళ స్టోరీ బ్యాన్‌లో ఉన్న బెంగాల్‌ ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. ఇదిలా ఉండగా.. ది కేరళ స్టోరీ సినిమాను తమిళనాడులో కూడా నిలిపివేశారు కానీ బ్యాన్ చేయలేదు. లా అండ్ ఆర్డర్ ఆందోళనల కారణంగా థియేటర్ల యజమానులు సినిమాను ప్రదర్శించకూడదని నిర్ణయించుకున్నారు.

దీంతో, తమిళనాడులో ఈ సినిమా విడుదల కాలేదు. దీనితో తమిళనాడు సీఎం స్టాలిన్ ను కేరళ స్టోరీ మేకర్స్ కలిశారు. సినిమా రిలీస్ అయ్యేలా చూడాలంటూ కోరారు. ‘ది కేరళ స్టోరీ’ని నిషేధించిన మొదటి రాష్ట్రం పశ్చిమ బెంగాల్ మాత్రం సుప్రీమ్ వ్యాఖ్యలను తప్పుబట్టింది. ఈ సినిమా శాంతి భద్రతలకు భంగం కలిగించే అవకాశం ఉందని తెలిపింది. రాష్ట్రంలో శాంతిభద్రతలను కాపాడేందుకు హింసాత్మక ఘటనలు జరగకుండా ఉండేందుకు సినిమా ప్రదర్శనను నిషేధిస్తున్నట్లు తెలిపారు. అనంతరం, బెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ కూడా ది కేరళ స్టోరీ సినిమాపై సంచలన వ్యాఖ్యలు చేశారు. “ది కేరళ స్టోరీ” అంటే ఏమిటి?.. ఇది వక్రీకరించిన కథ అంటూ సీరియస్‌ అయ్యారు. అయితే ఇప్పుడు బెంగాల్ లో సినిమాను రిలీజ్ చేస్తారా లేదా అనేది ఇంట్రెస్టింగ్ గా మారింది.