Sidhu Jonnalagadda,: మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందేనా..?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) ముందు వరుసలో ఉంటాడు.. రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌ (Tillu Square) తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మాంచి జోరుమీదున్నాడు.. రెండేళ్ల నిరీక్షణకు చెక్‌ పెడుతూ.. ఓవర్సీస్‌లో సైతం ఈ టిల్లుగాడు రికార్డుల మోత మోగించాడు.

 

 

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న హీరోల్లో సిద్ధు జొన్నలగడ్డ (Sidhu Jonnalagadda) ముందు వరుసలో ఉంటాడు.. రీసెంట్‌గా టిల్లు స్క్వేర్‌ (Tillu Square) తో సూపర్‌ హిట్‌ను తన ఖాతాలో వేసుకున్న ఈ యువ హీరో ఇప్పుడు మాంచి జోరుమీదున్నాడు.. రెండేళ్ల నిరీక్షణకు చెక్‌ పెడుతూ.. ఓవర్సీస్‌లో సైతం ఈ టిల్లుగాడు రికార్డుల మోత మోగించాడు. దీంతో.. సిద్దు చేయబోయే నెక్ట్స్ మూవీస్‌పై విపరీతమైన అంచనాలు పెరిగిపోయాయి. అటు.. సిద్ధు సైతం తన నెక్ట్స్ ప్రాజెక్ట్స్‌ విషయంలో పక్కా ప్లానింగ్‌తో ముందుకు వెళ్తున్నాడు. సినిమాల విషయంలో సిద్ధూ ప్లానింగ్ చూస్తుంటే మైండ్ బ్లాంక్‌ అయిపోతుందని విశ్లేషకులు సైతం ప్రశంసలు కురిపిస్తున్నారు.

ప్రస్తుతం సిద్ధు బొమ్మరిల్లు భాస్కర్ (Bommarillu Bhaskar) తో ‘జాక్’, నీరజ కోనని దర్శకురాలిగా పరిచయం చేస్తూ తెలుసు కదా సినిమాలు చేస్తున్నాడు. ఇక.. సిద్ధు ఫ్యాన్స్ అందరూ ఎంతో యాంగ్జైటిగా ఎదురు చూస్తున్న టిల్లుక్యూబ్ కూడా స్క్రిప్టు పనులు జరుపుకుంటోంది.. అవి పూర్తి కాగానే ఆ మూవీని కూడా సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. డైరెక్టర్ సెంటిమెంట్ ని ఫాలో అవుతూ ఈసారి కూడా దర్శకుడిని మార్చి మ్యాడ్ ఫేమ్ కళ్యాణ్ శంకర్ ని ఓకే చేసుకున్నట్టు ఇన్ సైడ్ టాక్. మ్యాడ్ 3 షూటింగ్ అయ్యేలోపు దీనికి సంబంధించిన ప్రకటన వస్తుందంటుఉన్నారు. అయితే.. వీటికన్నా ముందు సిద్ధూ నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమా చేయాల్సింది. కథ ఓకే అనుకుని అంతా రెడీ అనుకుంటున్న టైంలో అన్నీ మంచి శకునములే ఫ్లాప్ కావడంతో ఈ కాంబోకు బ్రేక్ పడిందని టాక్ వినిపిస్తోంది.. అయితే.. ఈ స్టోరీని నందిని రెడ్డి తేజ సజ్జకు వినిపించారని. ఆ స్టోరీ లైన్‌కు తేజ సజ్జా ఓకే అన్నట్లు ఫిలిం వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

ఎంతో కష్టపడి ఈ రేంజ్‌కు చేరుకున్న సిద్ధు జొన్నలగడ్డ మొహమాటాలకు తావివ్వకూడదని స్ట్రాంగ్‌గా ఫిక్సయిపోయాడట.. అందుకే స్టోరీ, డైరెక్టర్ విషయంలో చాలా కఠినంగా ఉంటున్నాడని అంటున్నారు. మొహమాటం కోసం రిస్క్ చేస్తే కెరీర్ ప్రమాదంలో పడుతుందని గుర్తించి దానికి అనుగుణంగా అడుగులు వేస్తున్నాడట. కానీ.. సిద్ధు ముందు అసలైన సవాల్ మరొకటి ఉంది. అదేంటంటే నిజానికి సిద్ధూకి గుర్తింపు తెచ్చింది టిల్లు సిరీసే. తనకు మాత్రమే సాధ్యమయ్యే శరీర భాష, డైలాగు టైమింగ్ తో ఫ్యాన్స్ ని ఆకట్టుకున్నాడు. కానీ జాక్ కోసం సిద్ధు పూర్తిగా వేషం మార్చాడు. వేరే జానర్, క్యారెక్టరైజేషన్స్ తో మెప్పించాల్సిన బాధ్యత సిద్దుపైన ఉంది. మరి.. తన కెరీర్‌ కోసం పక్కా ప్లానింగ్‌తో వెళ్తున్న సిద్ధు ఏ మేరకు సక్సెస్ అవుతాడో అన్నది చూడాల్సిందే..