Pushpa2 : ‘పుష్ప2’కి 40 కోట్ల లాస్

మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు.

 

 

మోస్ట్ అవైటేడ్ పాన్ ఇండియా ప్రాజెక్ట్ పుష్ప2 పై ఎక్కడా లేని అంచనాలున్నాయి. అయితే.. ఈ సినిమా మాత్రం అనుకున్న సమయానికి రిలీజ్ అవడం లేదు. దీంతో బడ్జెట్ పెరుగుతునే ఉందని అంటున్నారు. అందుకే.. 40 కోట్ల లాస్ అని కూడా అని టాక్ నడుస్తోంది.

వాస్తవంగా చెప్పాలంటే.. సినిమా బడ్జెట్ లెక్కలు నిర్మాతలకే కరెక్ట్‌గా తెలుస్తుంది. కానీ బయట చెప్పే లెక్కలు వేరేలా ఉంటాయని అంటూ ఉంటారు. అయితే.. ఈ లెక్కలు మాత్రం ఇంచుమించుగా మేకర్స్ చెప్పేదానికి దగ్గరగానే ఉంటాయనేది ఇండస్ట్రీ వర్గాల మాట. ఇదంతా ఇప్పుడు ఎందుకంటే.. ప్రస్తుతం పుష్ప2 గురించి ఓ లెక్క జోరుగా ప్రచారం జరుగుతోంది. గతంలో పుష్ప2 బడ్జెట్ 350 కోట్లు అని వార్తలు వచ్చాయి. అయితే.. పెరిగిన అంచనాలకు సుకుమార్ మరో 100 కోట్లు పెంచేశాడనే టాక్ బయటికొచ్చింది. కానీ ఇప్పుడు పుష్ప2 బడ్జెట్ మరింతగా పెరిగినట్టుగా తెలుస్తోంది. ఆగష్టు 15 నుంచి పుష్ప 2 పోస్ట్‌పోన్ అవడంతో.. నిర్మాతలపై అదనపు భారం భారీగా పడుతుందనే చర్చ జరుగుతోంది. సుమారు నాలుగు నెలలు వాయిదా పడటంతో.. దాదాపు 40 కోట్ల బడ్జెట్ ఈ చిత్రానికి అదనంగా ఖర్చు కానుందని కథనాలు వస్తున్నాయి.

షూటింగ్‌ కంప్లీట్ అవడానికి ఇంకా 50 రోజులు పడుతుందట. కొన్ని సీన్లను కూడా రీషూట్ చేయనున్నారట. పైగా కొందరు నటీనటుల నుంచి కొత్తగా డేట్స్ అడ్జెస్ట్ చేసుకోవాలి. దీనికి తోడు ఇప్పటికే అడ్వాన్స్ ఇచ్చిన డిస్ట్రీబ్యూటర్స్‌ వడ్డీ కూడా భరించాల్సి ఉంటుందట. ఇలా పుష్ప2 మేకర్స్‌కు సుమారు 40 కోట్ల వరకు అదనంగా బడ్జెట్ భారం పెరుగుతోందనే టాక్ నడుస్తోంది. ఒకవేళ అనుకున్న సమయానికి సినిమాను పూర్తి చేసి రిలీజ్ చేసి ఉంటే.. ఇంత ఖర్చు అయ్యి ఉండేది కాదంటున్నారు. కాబట్టి.. పుష్ప2 వాయిదా వల్ల 40 కోట్ల అదనపు భారమని అంటున్నారు. అయితే.. పుష్ప2 పై ఉన్న అంచనాలకు ఇదేం పెద్ద లెక్క కాదనే కామెంట్స్ వస్తున్నాయి. ఖచ్చితంగా ఈ సినిమా వెయ్యి కోట్ల బొమ్మ అవుతుందనే అంచనాలున్నాయి. మరి పుష్ప2 ఎలా ఉంటుందో చూడాలి.