ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప2 తో 1000 కోట్లు రాబట్టిన వెంటనే అరెస్ట్ అయ్యాడు.తర్వాత బేయిలొచ్చింది. ఊహించనంతగా సానుభూతి, సినీ జనాలనుంచి సపోర్ట్ దక్కింది. కట్ చేస్తే ఈ ఇయర్ తనకి హిట్ తో పాటు పీడకలలాంటి జైలు జీవితాన్ని రుచి చూపించింది..వచ్చే ఏడాదైనా కూల్ గా ఉంటుందా అంటే, అక్కడా ఒక పెద్ద పీడకలకి ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఇలాంటి పీడకలే మంచు ఫ్యామిలీని వెంటాడుతోంది. 2024 అంటేనే 5 పాన్ ఇండియా హిట్లని టాలీవుడ్ ఎంత మురిసినా, ఆ ఐదు బ్లాక్ బస్టర్లను మరిచిపోయేంతగా ఐదు షాకులు కూడా తగిలాయి. సలార్, కల్కీ, దేవర, హనుమాన్, పుష్ప2 ఎంత గొప్ప హిట్లైనా, ఈ ఏడాది టాలీవుడ్ కి ఆ సంబరం దక్కలేదు. ఆ సంతోషం క్షణాల్లో ఆవిరయ్యేలా చేశాయి ఐదు వివాదాలు… ఆ కాంట్రవర్సీ ఇప్పుడప్పుడే ఇండస్ట్రీని వీడేలా లేదు…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ థియేటర్ కి రావటం వల్లే, జనాల తొక్కిసలాటలో ఓ మహిళ మ్రుతి చెందటమే కాదు తన కొడుకు మ్రుత్యువుతో పోరాడే పరిస్థితి వచ్చింది. అసలే ఈవిషయంలో తనకి అరెస్టు, బేయిల్ తర్వాతత తన కోసం టాలీవుడ్ పెద్దలు కలిసొచ్చారు. బన్నీకి తోడుగా నిలబడ్డారు.. కాని అదేదో ఘనకార్యం చేసినట్టు బన్నీని అందరు స్టార్స్ కలవటం, తను చిరు అండ్ కో ని కలవటం చూసి విమర్శలు పెరిగాయి.
ఎంతగా ఆలేడీ చావుకి బన్నీ ప్రత్యక్ష కారణం కాకున్నా, పరోక్షంగా తను రూల్స్ ఫాలో కాకపోవటం వల్ల ఆ కేసు తనని ఇంకా వెంటాడే ఛాన్స్ ఉంది. హాస్పిటల్ లో మ్రుత్యువుతో పోరాడుతున్న శ్రీతేజ్ పరిస్థితి ఏమాత్రం వికటించినా, బన్నీ అండ్ కో బయటపడటం చాలా కష్టమనంటున్నారు
ఇదే ఈ ఏడాది సెన్సేషనైన వివాదం అనుకుంటే, అదేరేంజ్ లో మరో వివాదం షాక్ ఇచ్చింది. అదే మంచులా కరిగిపోతున్న మోహన్ బాబు ఇమేజ్. తన కొడుకుల ఆస్తి తగాదాలు, రిపోర్టన్ ని మోహన్ బాబు కొట్టి, హాస్పిటల్ వెల్లి పరామర్శించడాలు.ఈ ఎపిసోడ్ అంతా పాన్ ఇండియా లెవ్లలో ఫోకస్ అయ్యింది
పాన్ ఇండియా మూవీ తీసినా మంచు ఫ్యామిలీకి ఇంతగా పాన్ ఇండియా లెవల్లో మీడియాలో ఫోకస్ దొరకేది కాదేమో కాని.. ఈ వివాదం పుణ్యమాని పాన్ ఇండియా లెవల్లో వీళ్ల మీదే రెండుమూడు రోజులు వార్తలొచ్చాయి. మోహన్ బాబు అరెస్ట్ మాత్రం పక్కా అంటున్నారు. ఇది బన్నీ కేసుకంటే తీవ్రమైనది కావటంతో బన్నీ లానే,మోహన్ బాబుకి ఈ ఏడాదే కాదు వచ్చే ఏడాది కూడా వివాదం కంటిన్యూ అయ్యేలా ఉంది
ఈ ఏడాదిలో కల్కీ, దేవర, పుష్ప2, హనుమాన్ తోపాటు లాస్ట్ ఇంయర్ ఎండ్ కి విడుదలైన సలార్ ని కూడా ఈ ఏడాది ఎకౌంట్ లో నే వేస్తున్నారు. అలా ఐదు పాన్ ఇండియా హిట్లొచ్చినా కూడా టాలీవుడ్ మాత్రం సంతోషంగా ఉండే పరిస్థితిలేదు. ఎందుకంటే పాన్ ఇండియా లెవల్లో ఐదు హిట్లే కాదు, ఐదు వివాదాలు కూడా తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేశాయి
బన్నీ, మోహన్ బాబు ఎపిసోడ్ కంటే ముందే కింగ్ నాగార్జున కోడలు సమంత మీద కాంగ్రెస్ మంత్రి కామెంట్లు.. నాగార్జున కోర్టుని అప్రోచ్ అవటం, అంతకుముందు ఎన్ కన్వెషన్ సెంటర్ కూల్చటం… ఇలా ఈ ఏడాదిలో ఇండస్ట్రీకి గట్టి షాకులే వివాదంగా మారాయి
విచిత్రం ఏంటంటే రామ్ గోపాల్ వర్మని కూడా కోర్టు కేసులు వెంటాడాయి. తను తప్పించుకు తిరగాల్సిన పరిస్థితులొచ్చాయి. ఐతే వీటన్నీంట్లో టాప్ కాంట్రవర్సి, రేప్ కేసు…. కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసు కొలిక్కి వచ్చిందా? నీరుగారిందా అన్న చర్చ జరుగుతూనే ఉంది. కాని తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ వరుస హిట్లతో దూసుకుపోతుందని కుల్లుకునే బ్యాచ్ కి ఈ ఐదు వివాదాలు కాస్త రిలీఫ్ ఇచ్చినట్టున్నాయి… ఐతే ఈ ఐదింట్లే ఏవివాదం 2024 కే పరిమితం కాలేదు. వచ్చే ఏడాది కూడా టు బీ కంటిన్యూ అనక తప్పదు.