జానీ మాస్టర్ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం అయింది. ఈ వ్యవహారంలో జానీ మాస్టర్ తప్పు చేసాను అని ఒప్పుకోవడం ఒక సంచలనం అయితే అనూహ్యంగా ఆయనకు సోషల్ మీడియాలో కొందరు మద్దతు ఇవ్వడం షాక్ కి గురి చేసింది. ఈ కేసులో ప్రస్తుతం జానీ మాస్టర్ జైల్లోనే ఉన్నాడు. ఆయనకు బెయిల్ కూడా ఇప్పట్లో వచ్చే అవకాశం కనపడటం లేదు. జానీ మాస్టర్ కు కచ్చితంగా శిక్ష పడటం ఖాయం అనే వార్తలు కూడా ఈ మధ్య కాలంలో బలంగానే వస్తున్నాయి. ఇక బాధితురాలిని జానీ మాస్టర్ భార్య కూడా వేధించింది అనే ప్రచారం ఉంది.
ఆమె… బాధితురాలిని కొట్టి… పెళ్లి చేసుకోమని వేధించింది అంటూ వార్తలు వచ్చాయి. ఇదే విషయాన్ని బాధితురాలు పోలీసుల దృష్టికి కూడా తీసుకు వెళ్ళింది. అదే సమయంలో జానీ మాస్టర్ ను గోవాలో ఉంటే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇటీవల ఈ వ్యవహారంలో ఓ కీలక పరిణామం చోటు చేసుకుంది. జానీ మాస్టర్ కు జాతీయ అవార్డ్ రాగా… ఆయనపై పోక్సో కేసు నమోదు కావడంతో ఆ అవార్డుని రద్దు చేసింది కమిటీ. దీనితో ఆయనకు కోర్ట్ మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ ని రద్దు చేయాలని పోలీసులు పిటీషన్ వేసారు.
కాని కోర్ట్ బెయిల్ ఇచ్చినా జానీ మాస్టర్ మాత్రం బయటకు రాలేదు. తాము రావడం లేదు అంటూ జానీ మాస్టర్ లాయర్ కూడా కోర్ట్ కి తెలిపారు. ఇక ఇప్పుడు ఈ కేసులో బాధితురాలి మీద నెల్లూరులో ఓ కేసు నమోదు కావడం సంచలనం అయింది. స్రష్టి వర్మ తనను లైంగికంగా వేధించింది అంటూ జానీ మాస్టర్ బంధువు ఒకరు కేసు పెట్టారు. తాను మైనర్ గా ఉన్న సమయంలో స్రష్టి వర్మ… తన నగ్న ఫోటోలు తీసి బెదిరించారు అని నెల్లూరు సంతపేట పోలీస్ స్టేషన్ లో సమీర్ అనే యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేసాడు.
రంగ నాయకుల ప్పేటకు చెందిన సమీర్ జానీ మాస్టర్ మామ కుమారుడు. 2021 లో హైదరాబాద్ చెన్నై లో షూటింగ్ ఉన్న సమయంలో… తన మామతో కలిసి వెళ్ళిన టైం లో శ్రష్టి వర్మ తనను లైంగికంగా వేధించింది అంటూ ఫిర్యాదు చేసాడు. లిఫ్ట్ లో షూటింగ్ సమయంలో అలాగే క్యారవాన్ లో కూడా తనను వేధించింది అని… లాడ్జీలో తనపై లైంగిక దాడి చేసిందని తన నగ్న ఫోటోలు తీసి ఎవరికి అయినా చెప్తే ఆ ఫోటోలు అందరికీ పంపిస్తా అని బెదిరించిందని సమీర్ పేర్కొన్నాడు. ఇక తనను లైంగికంగా వేధించిన ఆ అమ్మాయిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నాడు.