రెండో పెళ్లి చేసుకున్న స్టార్‌ డైరెక్టర్‌

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ అంటే అంతా చెప్పే పేరు క్రిష్ జాగర్లమూడి. సరికొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేసే ఈ డైరెక్టర్‌.. తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు.

  • Written By:
  • Publish Date - November 11, 2024 / 07:32 PM IST

తెలుగు సినీ పరిశ్రమలో విభిన్నమైన చిత్రాలకు కేరాఫ్ అడ్రస్‌ అంటే అంతా చెప్పే పేరు క్రిష్ జాగర్లమూడి. సరికొత్త సినిమాలతో ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఎంటర్టైన్‌ చేసే ఈ డైరెక్టర్‌.. తన వ్యక్తిగత జీవితంలో మరో కొత్త అధ్యాయం మొదలు పెట్టాడు. హైదరాబాద్‌కు చెందిన ప్రీతి చల్లా అనే డాక్టరును పెళ్లి చేసుకున్నాడు. కొన్ని రోజులుగా ఈ విషయంపై అనేక రకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. క్రిష్‌ లవ్‌లో ఉన్నాడు అంటూ కొందమంది చెప్తే.. లేదు ఆల్రెడీ సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్నాడు అని కొంత మంది మాట్లాడుతున్నారు. ఈ పుకార్లన్నిటికీ ఎండ్‌ కార్డ్‌ వేస్తూ డైరెక్ట్‌గా పెళ్లి ఫొటోలతో క్లారిటీ ఇచ్చేశాడు ఈ టాలెంటెడ్‌ డైరెక్టర్‌.

క్రిష్‌ పెళ్లి చేసుకున్న ప్రీతికి కూడా గతంలో పెళ్లి జరిగింది. అప్పటికే ఆమె గైనకాలజిస్ట్‌. కానీ కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల ప్రీతి భర్తతో విడిపోయింది. కొంత కాలం తరువాత క్రిష్‌కు ప్రీతితో పరిచయం ఏర్పడింది. ఇద్దరి మనసులు కలవడంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. కొన్నాళ్ల పాటు వీళ్ల మధ్య ప్రేమాయణం కంటిన్యూ అయ్యింది. ఈ క్రమంలోనే వీళ్ల గురించి చాలా రూమర్స్‌ వచ్చాయి. చివరగా ఇద్దరు ఇద్దరి ఇళ్లలో విషయం చెప్పి పెళ్లికి ఒప్పించారు. ప్రీతికి ఇప్పటికే ఓ కొడుకు ఉన్నాడు. ఇప్పుడు ఆ కొడుకు బాధ్యత కూడా క్రిష్‌ తీసుకోబోతున్నాడు. వీళ్లిద్దరి పెళ్లి హైదరాబాద్‌లోనే జరిగినట్టు తెలుస్తోంది. వీళ్ల పెళ్లికి రిలేటివ్స్‌తో పాటు చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌ మాత్రమే హాజరైనట్టు సమాచారం. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో క్రిష్‌ పెళ్లి ఫొటోలు వైరల్‌ అవుతున్నాయి. కొత్త కపుల్‌కు కంగ్రాట్స్‌ చెప్తూ ఫ్యాన్స్‌ అంతా పోస్టులు పెడుతున్నారు.