Salar : ‘సలార్’లో ‘కేజీఎఫ్’ని మించిన వయలెన్స్..

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ 'సలార్' డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. ఆ ట్రైలర్ తో 'సలార్'లో 'కేజీఎఫ్'ని మించిన వయలెన్స్ ఉండబోతుందనే అంచనాకు ప్రేక్షకులు వచ్చారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుందని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు.

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో రూపొందిన బిగ్గెస్ట్ యాక్షన్ ఫిల్మ్ ‘సలార్’ డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాపై అంచనాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రీసెంట్ గా విడుదలైన రిలీజ్ ట్రైలర్ అంచనాలను ఆకాశాన్నంటేలా చేసింది. ఆ ట్రైలర్ తో ‘సలార్’లో ‘కేజీఎఫ్’ని మించిన వయలెన్స్ ఉండబోతుందనే అంచనాకు ప్రేక్షకులు వచ్చారు. అయితే దర్శకుడు ప్రశాంత్ నీల్ మాత్రం ఈ సినిమాలో డ్రామా ఎక్కువ ఉంటుందని చెప్పి సర్ ప్రైజ్ ఇచ్చాడు..

సలార్ ప్రమోషన్స్ లో భాగంగా ఎస్.ఎస్. రాజమౌళి హోస్ట్ గా చేసిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూను విడుదల చేశారు మేకర్స్. ఈ ఇంటర్వ్యూలో ప్రభాస్, ప్రశాంత్ నీల్, పృథ్వీరాజ్ సుకుమారన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ నీల్ సలార్ కి సంబంధించి ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. ఇది తన నాలుగో సినిమా అని చెప్పుకొచ్చాడు. విడుదలకు ముందు తన గత చిత్రాలు తనకు పూర్తిస్థాయిలో నచ్చలేదు. కానీ ఇప్పుడు సలార్ మాత్రం ఎంతగానో నచ్చిందన్నాడు. . ఈ సినిమాలో డ్రామా ఎక్కువగా ఉంటుందని కథకు కట్టుబడి, ఎలాంటి డీవియేషన్స్ లేకుండా చేశానన్నాడు. ట్రైలర్ లో ప్యూర్ డ్రామా చూపించ లేకపోయి ఉండొచ్చు కానీ సినిమాలో మాత్రం ప్యూర్ డ్రామా ఉంటుందని హైప్ క్రియేట్ చేశాడు నీల్ మామ.

ప్రశాంత్ నీల్ మాటలపై స్పందించిన రాజమౌళి.. డ్రామా ఎల్లప్పుడూ వర్క్ అవుతుంది. ముఖ్యంగా ప్రభాస్ తో బాగా వర్క్ అవుతుంది. అతను ప్రత్యేకంగా ఏమీ చేయనవసరం లేదు. అలా నిల్చొని భావోద్వేగాన్ని పండించగలడు. ప్రేక్షకులు దానిని అనుభూతి చెందుతారు.” అని అన్నాడు. రాజమౌళి తన సినిమాల్లో ఎమోషన్స్ కి పెద్ద పీట వేస్తాడు. ఇప్పుడు ప్రశాంత్ నీల్ కూడా ‘సలార్’లో యాక్షన్ తో పాటు ఎమోషన్స్ కి పెద్ద పీట వేశాడని అర్థమవుతోంది. చూస్తుంటే ఈ సినిమా ‘కేజీఎఫ్ ని మించిన సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.