సముద్రంలో విహరించాలని, అలల ఒడిలో సేద తీరాలని అందరికీ ఆసక్తి ఉంటుంది. అది కూడా ఒక గంట, అరపూట కాదు. దాదాపు రెండు మూడు రోజులు అలా లాంగ్ జర్నీ చేయాలని కోరుకుంటారు నేచర్ లవర్స్. ఇలాంటి వారికోసం ఒకప్పుడు టైటానిక్ ఉండేది. అందులో అత్యంత సుందరమైన ఫర్నీచర్, బెడ్ రూం, సీ వ్యూ, వాష్ రూం ఇలా అన్నీ ఉన్న గదులు అందులో ఉండేవి. దురదృష్టవ శాత్తు ఆ షిప్ ప్రమాదానికి గురైంది. ఆ తరువాత అలా విహరిద్దాం అనుకున్నా ఆ స్థాయి నౌక ఎక్కడా అందుబాటులోకి రాలేదు. తాజాగా ఫిన్లాండ్ లో టైటానిక్ ను తలదన్నేలా.. దానికంటే ఐదు రెట్లు పెద్దదిగా ఒక షిప్ ను నిర్మించారు. ఇది ప్రపంచంలోని అన్ని నౌకల్లోకి స్వర్గధామంగా మారింది. అందుకే దీనికి ఐకాన్ ఆఫ్ ది సీన్ అని నామకరణం చేశారు. ఈ ‘ఐకాన్ ఆఫ్ ది సీన్’ లోని ప్రత్యేకతలు ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఈ నౌక రాయల్ కరేబియన్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందినది. ఇది 1200 అడుగుల పొడవుతో 2 లక్షల 50వేలకు పైచిలుకు టన్నుల బరువు కలిగి ఉంది. ఈ నైకలో కేవలం సిబ్బందే దాదాపు 2500 మంది వరకూ ఉంటారు. అంతేకాకుండా ఒకేసారి 5వేల మందికి పైగా ప్రయాణీకులు ఇందులో ప్రయాణించే విధంగా రూపొందించారు. ఇక ఆహారం విషయానికి వస్తే ప్రపంచంలోని 40 ప్రముఖ దేశాలకు చెందిన రకరకాలా ఫుడ్స్ అందుబాటులో ఉంటాయి. తాజాగా ఈ నౌక జూన్ 22న విజయవంతంగా ట్రయల్ రన్ నిర్వహించింది. 2024 జనవరిలో మియామి నుంచి ఈ నౌక బయలుదేరి కరేబియన్ సాగర తీర ప్రాంతాల్లోని జిల్లాల మీదుగా ప్రయాణిస్తుంది. ఇందులో జర్నీ చేయాలనే ఆసక్తితో ఇప్పటికే రికార్డ్ స్థాయిలో ప్రయాణీకులు టికెట్ బుకింగ్ కి క్యూ కట్టినట్లు తెలుస్తుంది. ప్రయాణీకులు సౌకర్యార్ధం రకరకాల ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి. కనిష్టంగా ఏడు రాత్రులు ఈ ఓడలో గడిపేందుకు ఈదేశ కరెన్సీ ప్రకారం మూడు వేల పౌండ్లు చెల్లించాలి. అంటే దాదాపు మూడు లక్షలకు పైగానే వెచ్చించాలి.
ఈ నౌక ప్రత్యేకతలు ఇవే..
T.V.SRIKAR