ఇండియన్ సినిమాలో ఇప్పుడు నలుగురు హీరోలు ఓ సెన్సేషన్… వాళ్ళ పేరు వింటే ఫ్యాన్స్ కు పూనకాలు… బాక్సాఫీస్ షేక్ అయి బ్లాస్ట్ కావడం ఖాయం. వాళ్ళ సినిమా అనౌన్స్ చేస్తే రికార్డులకు చెమటలు… ఇంతకు ఆ నలుగురు హీరోలు ఎవరో మీకు క్లారిటీ వచ్చే ఉంటుంది కదా…? రెబల్ స్టార్ ప్రభాస్, యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, దళపతి విజయ్… ఇప్పుడు వీళ్ళ ప్రాజెక్ట్ లు టేకప్ చేస్తే నిర్మాతలకు కాసుల వర్షమే. సినిమా సినిమాకు రేంజ్ పెంచుకుంటూ పోతున్నారు ఈ నలుగురు హీరోలు.
ఇండియాలో ప్రభాస్ సినిమా అంటే ఇప్పుడు వెయ్యి కోట్ల మూవీ అని డిసైడ్ అయ్యారు ఆడియన్స్. బాలీవుడ్ హీరోల హిట్ సినిమాలకు ప్రభాస్ ఫ్లాప్ సినిమాలకు వసూళ్లు దాదాపుగా అలానే ఉన్నాయి. కల్కీ సినిమాతో 1200 కోట్ల వసూళ్లు సాధించి ప్రభాస్ ఇప్పుడు ఎవరికి అందని ఎత్తులో ఉన్నాడు. ఇప్పుడు ఏకంగా నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి అన్ని భాషల్లో స్టార్ హీరోలకు సవాల్ చేస్తున్నాడు. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ విషయానికి వస్తే దేవర సినిమాతో పాన్ ఇండియాకు సినిమాలకు కొత్త టార్గెట్ ఫిక్స్ చేసాడు. ఇప్పుడు బాలీవుడ్ లో పాగా వేస్తున్నాడు.
ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ రేంజ్ పెరిగిపోయింది. ఇప్పుడు పుష్ప 2 తో దుమ్ము రేపాలని రికార్డులు బద్దలు కొట్టాలని టార్గెట్ గా పెట్టుకున్నాడు. ఇక దళపతి విజయ్ విషయానికి వస్తే ఇండియాలో 275 కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే ఒకే ఒక్క హీరో విజయ్. విజయ్ తో సినిమా అంటే తమిళ డైరెక్టర్లకు ఓ చాలెంజ్. అయితే ఈ నలుగురిలో ఓ కామన్ విషయం ఉంది. వీళ్ళు సినిమాల్లో అడుగుపెట్టిన తర్వాత వీళ్ళ లుక్స్ గురించి చాలా కామెంట్స్ వచ్చేవి. చూడటానికి అందంగా లేరని సినిమా రంగంలోనే కామెంట్ చేసారు.
విజయ్ కెరీర్ స్టార్ట్ చేసిన సమయంలో నల్లగా ఉండేవాడు. ఆ టైం లో అతని గురించి తమిళ జనాలే కామెంట్ చేసారు. ఇక ప్రభాస్ ను ఈశ్వర్ సినిమా టైం లో చాలా కామెంట్స్ చేసారు. రాఘవేంద్ర సినిమాలో ప్రభాస్ లుక్స్ ను ఆడియన్స్ కూడా కామెంట్ చేసేవాళ్ళు. ఎన్టీఆర్ విషయానికి వస్తే అప్పట్లో చాలా లావుగా ఉండేవాడు. ఆ టైం లో ఎన్టీఆర్ ను టార్గెట్ చేసి… అసలు హీరోగా పనికిరాడు అంటూ ఓ వర్గం బాగా టార్గెట్ చేసారు. ఇక అల్లు అర్జున్ గంగోత్రి సమయంలో చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. ఆ క్లిప్స్ ఇప్పటికీ సోషల్ మీడియాలో వైరల్ చేస్తూనే ఉంటారు. ఇలా ఒకప్పుడు దారుణమైన ట్రోలింగ్ ఎదుర్కొన్న నలుగురు హీరోలు ఇప్పుడు బాక్సాఫీస్ కు దిక్కు అయ్యారు.