పుట్టిన వెంటనే పేరు కన్పామ్ చేయటానికి కారణం, నాలుగు నెలల ముందే కొన్ని పేర్లను చిరు, చెర్రీ, ఉపాసన నిర్ణయించారట. పుట్టే టైం, నక్షత్రం ఆధారంగా ఆపేర్లలో ఏదో ఒకటి కన్ఫామ్ చేయాలని, అనుకున్నారట. ఆలెక్కన మెగా లిటిల్ ప్రిన్సెప్ పేరు మీదే చర్చ జరుగుతోంది.
పవన్ కొడుకు అఖీరా నందన్, కూతురు ఆద్య, మరో కూతురు మార్క్ శంకర్ పవనో విచ్.. ఇక చిరు కూతురు శ్రీజ తన కూతుళ్లకి నవిష్క, నివ్రుత్తి అన్న పేర్లు పెట్టింది. అలానే చిరు పెద్దకూతురి పిల్లల పేర్లు చూస్తే సమర, సంహిత అని నామకరణం చేశారు. సో రామ్ చరణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్, వరుణ్ తేజ్ ఇలా ఒకరి పేర్లతో మరోకరి పేర్లకు కామన్ గా తేజ్ అని ఉన్నట్టు, పవన్ పిల్లలకి కాని, శ్రీజ, సుస్మిత పిల్లలకి కాని పేర్లలో పోలికలు లేవు. కాబట్టి ఖచ్చితంగా చెర్రీ కూతురి పేరు మరొకరితో పోలి ఉండదనే అభిప్రాయం ఉంది. మరి అల్లు అర్జున్, స్నేహల పేర్లు కలిపి అర్హా అని పేరు పెట్టినట్టు రామ్ చరణ్, ఉపాసన పేర్లు కలిపేస్తారా అంటే కుదిరేలా లేదు. ఐతే ఏ పేరు పెట్టినా అందులో లక్ష్మీ అన్న పదం ఉండాలని అనుకుంటున్నారట. సో సాయి లక్ష్మీ, రామ లక్ష్మి, సహస్ర లక్ష్మీ ఇలా కొన్ని పేర్లు అనుకున్నట్టు ప్రచారం జరుగుతోంది.
మెగా ఫ్యామిలీలో మరో అంశం కూడా ఆలోచనల్లో పడేస్తోంది. ఫ్యాన్స్ ని ఖుషీ చేస్తోంది. చిరు, నాగబాబు, పవన్ ముగ్గురికీ ఒక్కో కొడుకు పుట్టడం, కనీసం ఒక కూతురు, లేదంటే ఇద్దరు కూతుల్లు ఉన్నారు. కాని చరణ్, సుశ్మితా, శ్రీజ, ముగ్గురికీ ఆడపిల్లలే పుట్టడంతో ఈ సెంటిమెంట్ తోపాటు మరో సెంటిమెంట్ విషయంలో కూడా చిరు ఫ్యాన్స్ హ్యాపీగా ఉన్నారు. చిరుకి కూతురు పుట్టాకే సుప్రీమ్ స్టార్ కాస్త మెగాస్టార్ అయ్యాడు. సో చెర్రీ కూడా పాన్ వరల్డ్ స్టార్ అవ్వబోతున్నాడనే సెంటిమెంట్ పెరిగింది.