అక్కడ బాహుబలినే మించిన దేవర… 500 కోట్లు లెక్కే కాదు…

దేవర బ్లాక్ బస్టర్ ఫ్యాన్స్ కి అర్ధమైనట్టు, తమిళ, హిందీ దర్శకులకు అర్ధం కావట్లేదు. వాళ్లంతా జుట్టుపీక్కునే పరిస్థితొచ్చింది. మొదటి రోజు ఓపెనింగ్స్ 172 కోట్లు వచ్చినా, రివ్యూలు నెగెటీవ్ గా వచ్చాయని సంబర పడ్డారు. కాని వసూళ్ల వరద 1000 కోట్లదాటాకే వాళ్లకు, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది.

  • Written By:
  • Updated On - October 15, 2024 / 01:23 PM IST

దేవర బ్లాక్ బస్టర్ ఫ్యాన్స్ కి అర్ధమైనట్టు, తమిళ, హిందీ దర్శకులకు అర్ధం కావట్లేదు. వాళ్లంతా జుట్టుపీక్కునే పరిస్థితొచ్చింది. మొదటి రోజు ఓపెనింగ్స్ 172 కోట్లు వచ్చినా, రివ్యూలు నెగెటీవ్ గా వచ్చాయని సంబర పడ్డారు. కాని వసూళ్ల వరద 1000 కోట్లదాటాకే వాళ్లకు, దిమ్మ తిరిగి బొమ్మ కనిపిస్తోంది. ఇదెలా సాధ్యమైందో బాలీవుడ్ వాళ్లకే కాదు, తమిళ తంబీలకు అర్ధం కావట్లేలేదు. బాహుబలి, త్రిబుల్ ఆర్ లాంటి ట్రెండ్ సెట్టర్స్ నే కుళ్లుతో లైట్ తీసుకున్న అరవ జనం, ఇక దేవరని చూస్తారా? తమిళ నాట వసూళ్ల వరద తక్కువైనంత మాత్రాన దేవర సునామీ ఆగుతుందా? ఇదే విషయాన్ని దేవర 16 రోజుల వసూళ్లు తేల్చాయి. ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పించాయి. అంతేకాదు బాహుబలి లాంటి ట్రెండ్ సెట్టర్ ని ఒకవిషయంలోనే కాదు, మరో లొకేషన్ లో కూడా దేవర దాటేశాడు… ఈ రికార్డులు ఇప్పట్లో ఆగేలా లేవని తేల్చాడు. దసరాకు దంచి కొట్టిన దేవర వసూళ్ల జోరు, ఇంకా అదే తీరులో నడుస్తోంది.

దేవర షేర్ వసూళ్లు 500 కోట్లైతే, గ్రాస్ కలెక్షన్స్1000 కోట్లని కన్ఫామ్ చేసుకుంటున్నారు. ఐతే నార్త్ ఇండియాలో షేర్ వసూళ్ల లో బాహుబలి రికార్డునే బ్రేక్ చేసిది దేవర మూవీ. నిజానికి రెబల్ స్టార్ ప్రభాస్ తో రాజమౌళి తీసిన బాహుబలి 1 హిందీలో 194కోట్ల షేర్ వసూళ్లు, అంటే అందరి వాటాలు పోను, నిర్మాతకు దక్కే వసూళ్ల విషయంలో భారీ రికార్డు క్రియేట్ అయ్యింది

తర్వాత బాహుబలి 2 హిందీలో ఏకంగా 450 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టింది. తర్వాత సలార్, కల్కీ మూవీలు 200 కోట్లకు పైనే షేర్ వసూళ్లు రాబట్టాయి. అలా రెబల్ స్టార్ తన బాహుబలి తాలూకు 194 కోట్ల నార్త్ ఇండియా షేర్ కలెక్షన్స్ రికార్డుని, 3 సార్లు బ్రేక్ చేశాడు. తన రికార్డులను తానే బద్దలు కొట్టుకుంటూ పోయాడు.

అయితే రాజమౌళి అండ్ కో సాయం లేకుండా, సోలోగా వచ్చిన దేవర ఏకంగా బాహుబలి 1 తాలూకు రికార్డును బ్రేక్ చేశాడు. నార్ట్ ఇండియాలో 194 కోట్ల షేర్ వసూళ్లు రాబట్టిన బాహుబలి ది బిగినింగ్ రికార్డుని, ఇప్పుడు దేవర బ్రేక్ చేసింది. రాజమౌళి సపోర్ట్ లేకుండానే, ఒంటరిగా, దేవర మూవీతో నార్త్ ఇండియాలో 200 కోట్లకు పైనే షేర్ వసూళ్ల రాబట్టి చరిత్ర స్రుష్టించాడు మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్

దేవర మూవీ నార్త్ ఇండియాలో 350నుంచి 390 కోట్ల వరకు ఇప్పటి వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఇందులో నిర్మాత షేర్ 17 రోజుల్లో 240కోట్లు దాటి డిస్ట్రిబ్యూటర్లకు మైండ్ బ్లాంక్ అయ్యేలా చేస్తోంది. ఓ బడా స్టార్ మూవీ భారీ ఓపెనింగ్స్ తోరావటం వరకు ఓకే కాని, పూర్తిగా మొదటి రోజే నెగెటీవ్ టాక్ సొంతం చేసుకున్నాక కూడా, దేవర మాత్రం వసూళ్ల వరద తెచ్చింది. ఇది నిజంగా తమిళ హీరోలకే కాదు, దర్శక నిర్మాతలకు కూడా అర్ధం కావట్లేదు

వాళ్లు తంగలాన్ అని సినిమాచేస్తే, నార్త్ ఇండియన్స్ రిజెక్ట్ చేశారు. సూపర్ స్టార్ రజినీ కాంత్ మూవీ వెట్టయాన్ గా వస్తే,వద్దు పొమ్మన్నారు. అసలు ఏం ,చేస్తే నార్త్ ఇండియన్స్ కి నచ్చే సినిమా చేయొచ్చో తెలుగు దర్శకులకు తప్ప హిందీ, తమిళ ఫిల్మ్ మేకర్స్ కి తెలిసినట్టులేదు. వాళ్లు చేయని ప్రయోగం లేదు. కాని ఏది వర్కవుట్ కావట్లేదు… ఇలా ఓవైపు వీళ్లకు పిచ్చెక్కిపోతుంటే, సలార్, దేవర లాంటి మూవీలు నెగెటీవ్ టాక్ ని తెచ్చుకుని, యాంటీ ఫ్యాన్స్ కామెంట్లను తట్టుకుని, రివర్స్ లోరికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. తమిళ, హిందీ ఫిల్మ్ మేకర్స్ కి నిద్రపట్టకుండా చేస్తున్నాయి.