సరైన హిట్‌లేని ఓ తెలుగు యంగ్ హీరోకు టాలీవుడ్ నుంచి పిలుపొచ్చింది. అక్కడి టాప్ హీరో సినిమాలో ఛాన్స్ కొట్టేశాడట. అంతేకాదు..తెలుగులోనూ ఓ పెద్ద హీరో సినిమాలో శర్వా పేరు వినిపిస్తోంది.
శర్వానంద్ కనిపించి.. సూపర్‌హిట్ కొట్టి చాలాకాలం అయింది. ఇక సక్సెస్ అంటారా.. 2017లో వచ్చిన మహానుభావుడు తర్వాత సరైన హిట్ పడలేదు. ఒకే ఒక జీవితంతో ఓకె అనిపించుకున్నా.. ఎక్కువమంది ఆడియన్స్ దగ్గరకు వెళ్లలేదు. ఓవరాల్‌గా ఫేడౌట్ అయ్యాడనుకున్న శర్వా రెండు బడా ఆఫర్స్ కొట్టేశాడు.
జైలర్ తర్వాత రజనీకాంత్ జై భీమ్ ఫేం జ్ఞానవేల్ డైరెక్షన్‌లో నటించనున్నాడు. ఇందులో ఓ ముఖ్య పాత్రలో నాని ని తీసుకుంటారంటూ.. సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. మరి నాని ఎందుకు రిజక్ట్ చేశాడోగానీ.. ప్రస్తుతం శర్వా పేరు వినిపిస్తోంది. జైలర్ వంటి బ్లాక్‌బస్టర్ తర్వాత రజనీ నెక్ట్స్ మూవీ అంటే.. హైప్ ఓ రేంజ్‌లో వుంటుంది. జై భీమ్ తీసిన జ్ఞానవేల్ డైరెక్ట్ అంటే.. కథలో కొత్తదనం వుంటుందన్న నమ్మకం ఆడియన్స్‌లో వుంది. మరి ఇలాంటి ప్రతిష్ఠాత్మకమైన సినిమాను నాని వదిలేసుకోవడానికి కారణం లేకపోలేదు. విలన్ షేడ్స్ వున్న రోల్ కావడంతో.. వెనుకడుగు వేశాడట.
అన్నీ కలిసొస్తే.. శర్వానంద్ సూపర్‌స్టార్‌తోనే కాదు.. మెగాస్టార్‌తోనూ స్క్రీన్ పంచుకోనున్నాడు. భోళా శంకర్ తర్వాత చిరంజీవి సోగ్గాడే చిన్నినాయన ఫేం కల్యాణ్ కృష్ణ డైరెక్షన్ నటిస్తాడన్న టాక్ చాలకాలంగా వినిపిస్తోంది. ఇందులో ఓ పాత్ర కోసం సిద్దు జొన్నలగడ్డ రిజక్ట్ చేయడంతో.. ఆ పాత్ర శర్వానంద్ దగ్గరకు వచ్చిందని టాక్. సూపర్‌స్టార్.. మెగాస్టార్ ఊరిస్తున్నా.. సెట్స్‌పైకి వెళ్లేవరకు ఈ బంపర్ ఆఫర్స్‌ను నమ్మడానికి వీల్లేదు. నాని.. సిద్దు నో అనడం శర్వాకు కలిసొస్తుందో లేదో చూడాలి మరి.
హీరో రామ్ చరణ్ కు శర్వానంద్ చాలా క్లోజ్ ఫ్రెండ్. అలాగే రానా మిగిలి వాళ్ళతో కూడా శర్వా బాగానే ఉంటారు. కాకపోతే ఫిజిక్ లేకపోవడం, వాయిస్ లో గాంభీర్యం కనిపించకపోవడం, కామెడీ టైమింగ్ తెలియకపోవడం.. ఇప్పటి వరకు మంచి డైరెక్టర్ చేతిలో పడకపోవడంతో శర్వాకి కష్టపడే తత్వం ఉన్నా సక్సెస్ కాలేకపోతున్నాడు. ఆమధ్య సిద్ధార్థ తో కలిసి మహాసముద్రం మూవీ చేయడం.. శర్వా కి కొంత కలిసి వచ్చింది. ఇప్పుడు అదే తరహాలో పెద్ద పెద్ద హీరోలు పక్కన నటిస్తే తాను ఎస్టాబ్లిష్ కావడమే కాక.. యాక్షన్ లో మెచ్యూరిటీ కూడా వస్తుందని భావిస్తున్నాడు శర్వానంద్.