అల్లుడుకి శోభిత ఫ్యామిలీ కానుకలు ఇవే, కట్నం కాదు అంతకు మించి

ఏదైనా ప్రముఖుల పెళ్ళికి మీడియాలో వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ప్రత్యేకంగానే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం విషయంలో సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న హడావిడి చూసి అభిమానులు షాక్ అవుతున్నారు.

  • Written By:
  • Publish Date - December 4, 2024 / 01:24 PM IST

ఏదైనా ప్రముఖుల పెళ్ళికి మీడియాలో వెయిట్ ఎక్కువగా ఉంటుంది. వాళ్ళు ఏం చేసినా సరే దాన్ని ప్రత్యేకంగానే చెప్తూ ఉంటారు. ఇప్పుడు అక్కినేని నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల వివాహం విషయంలో సోషల్ మీడియాలో అలాగే ఎలక్ట్రానిక్ మీడియాలో జరుగుతున్న హడావిడి చూసి అభిమానులు షాక్ అవుతున్నారు. మొదటి పెళ్లి విషయంలో జరిగిన లోపాలను రెండో పెళ్లి విషయంలో జరగకుండా అక్కినేని ఫ్యామిలీ ఇప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఈ విషయంలో కొన్ని సెంటిమెంట్లు కూడా ఫాలో అవుతుంది అంటూ సోషల్ మీడియాలో ఎన్నో వార్తలు వస్తున్నాయి.

ఇక కాబోయే కోడలు విషయంలో అక్కినేని ఫ్యామిలీ చాలా జాగ్రత్తగా ఉంటుందని, ఎలక్ట్రానిక్ మీడియాలో కొన్ని న్యూస్ లు వైరల్ అవుతున్నాయి. ఇక తమ ఇంటికి కోడలుగా వస్తున్న శోభితకు భారీ గిఫ్ట్ ఇచ్చేందుకు అక్కినేని ఫ్యామిలీ రెడీ అయింది. టయోటా లెక్సస్ అనే వాహనాన్ని రెండు కోట్లు ఖర్చుపెట్టి నాగార్జున కొనుగోలు చేశారు. ఇది నాగచైతన్య పెళ్లి కోసమే కొన్నారని సోషల్ మీడియాలో ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. ఇటీవల ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి నాగార్జున కొత్త కారుతో వచ్చారు. ఈ కారు రిజిస్ట్రేషన్ చేసుకున్న అనంతరం అభిమానులతో ఫోటోలు కూడా దిగారు.

ఈ కారు ఖరీదు దాదాపు రెండున్నర కోట్లు. సెలబ్రిటీలకు ఈ కార్ చాలా ఇష్టం. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ కూడా ఇంతకుముందే కారును కొన్నాడు. ఇప్పుడు ఇదే కారును కోడలికి గిఫ్ట్ గా ఇవ్వనున్నారు. నాగార్జున ఇక ఈ పెళ్లికి ఆహ్వానించిన అతిధుల విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు. ఎక్కువమందిని ఆహ్వానించకుండా చాలా తక్కువ మందితోనే ఈ వివాహం చేయాలని రెడీ అయ్యారు. ఈ వేడుకకు అక్కినేని కుటుంబ సభ్యులతో పాటుగా సినీ పరిశ్రమలో నాగార్జునకు అత్యంత సన్నిహితంగా ఉండేవాళ్లు హాజరు అవుతారు.

అలాగే రాజకీయ ప్రముఖులను కేవలం 300 మందిని మాత్రమే ఆహ్వానించారు. చైతూ క్లోజ్ ఫ్రెండ్స్ కొందరు విదేశాల నుంచి వచ్చారట. అలాగే నాగ చైతన్య తల్లి లక్ష్మీ కూడా అమెరికా నుంచి వచ్చారు. ఇక నాగచైతన్యకు అక్కినేని ఫ్యామిలీ కానుకలతో పాటుగా శోభిత తల్లిదండ్రులు కూడా భారీగా కానుకలు ఇచ్చేందుకు రెడీ అయ్యారు. నాగచైతన్యకు ఒక ఆడి కారుతో పాటుగా ఎంతో ఇష్టమైన స్పోర్ట్స్ బైక్ కూడా ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. అలాగే హైదరాబాదులోనే ఒక లగ్జరీ విల్లాను కూడా నాగచైతన్యకు ఇవ్వనున్నారు. మరికొద్ది గంటల్లో జరగనున్న ఈ వివాహానికి ఇప్పటికే అన్నపూర్ణ స్టూడియోలో సపరేట్ గా మ్యారేజ్ సెట్ ని కూడా రెడీ చేశారు. ఈ వివాహం తర్వాత నాగచైతన్య శోభిత యూరప్ ట్రిప్ కు వెళ్లే ఛాన్స్ ఉందని టాక్.