దేవర రెండు కోట్ల సెంటర్స్ లెక్కలు ఇవే, ఎన్టీఆర్ ఆల్ టైం రికార్డ్

దేవర సినిమా విషయంలో ఎవరు ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ట్రోల్ చేసినా... జాతర మాత్రం ఎవడూ ఊహించని రేంజ్ లో జరిగింది. సినిమాను టార్గెట్ చేసి... అసలు ఫ్లాప్, డిజాస్టర్, వరస్ట్, క్రింజ్ అంటూ కామెంట్ చేసిన ఒక్కొక్కడికి గట్టిగా మూసుకునేలా ఆన్సర్ ఇచ్చాడు దేవర.

  • Written By:
  • Publish Date - October 22, 2024 / 06:35 PM IST

దేవర సినిమా విషయంలో ఎవరు ఏ రేంజ్ లో ప్లాన్ చేసి ట్రోల్ చేసినా… జాతర మాత్రం ఎవడూ ఊహించని రేంజ్ లో జరిగింది. సినిమాను టార్గెట్ చేసి… అసలు ఫ్లాప్, డిజాస్టర్, వరస్ట్, క్రింజ్ అంటూ కామెంట్ చేసిన ఒక్కొక్కడికి గట్టిగా మూసుకునేలా ఆన్సర్ ఇచ్చాడు దేవర. హిందీలో, తమిళంలో, కన్నడంలో దేవర సినిమా రికార్డులు క్రియేట్ చేసింది. ప్రీ బుకింగ్ మార్కెట్ దెబ్బకు బాలీవుడ్ హీరోలు కూడా షాక్ అయ్యారు. హాలీవుడ్ లో దేవర జాతర టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. 600 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది దేవర.

ఇక దేవర సినిమాతో ఎన్టీఆర్ కంప్లీట్ హ్యాపీగా ఉన్నాడు. పార్ట్ 2 విషయంలో కూడా ఎప్పుడైనా వర్క్ స్టార్ట్ చేయవచ్చు కూడా. ఇప్పుడు బాలీవుడ్ సినిమా వార్ 2 కోసం ముంబై వెళ్లి అక్కడ బిజీగా ఉన్నాడు. అక్కడ కొన్ని యాక్షన్ సీన్స్ ని షూట్ చేస్తున్నారు. తర్వాత ప్రశాంత్ నీల్ తో యాక్షన్ స్టార్ట్ చేస్తాడు. ఇదిలా ఉంటే దేవర ఇప్పుడు కొన్ని సెంటర్స్ లో కోటి రూపాయలు అంతకంటే ఎక్కువ వసూలు చేసి తన దమ్ము ఏంటో చూపించింది. హైదరాబాద్ నుంచి సీడెడ్ వరకు… వయా గోదావరి జిల్లాలను కలుపుకుని చుక్కలు చూపించింది.

దేవర ఒక్క థియేటర్ లో రెండు కోట్లు అంత కంటే ఎక్కువ వసూలు చేసిన సెంటర్స్ చూస్తే… వైజాగ్, గాజువాక, విజయనగరం, కాకినాడ, రాజమండ్రి, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, అనంతపురం, కర్నూలు, కడప సెంటర్స్ లో దేవర రెండు కోట్లు అంతకంటే ఎక్కువ వసూలు చేసింది. ఇక నైజాంలో ఆర్టీసి క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ థియేటర్ లో కోటికి పైగా వసూలు చేసి దేవర రికార్డులు క్రియేట్ చేసింది. దీనితో ఇప్పుడు టాలీవుడ్ హీరోలకు కంటి మీద కునుకు కరువైంది అంటున్నారు ఎన్టీఆర్ ఫ్యాన్స్.

దేవరను ఎక్కువగా టార్గెట్ చేసింది కచ్చితంగా మెగా ఫ్యాన్స్ కాబట్టి కచ్చితంగా మెగా హీరోల సినిమాలు ఆ రికార్డులు అందుకోలేదు అంటే కచ్చితంగా ట్రోల్ చేయడం ఖాయం జనాలు. ఇప్పటికే ఎన్టీఆర్ ఫ్యాన్స్… మెగా హీరోల మీద రగిలిపోతున్నారు. ఏ రేంజ్ లో ట్రోలింగ్ ఉంటుందో చెప్పడం కూడా కష్టమే. రామ్ చరణ్ గేమ్ చేంజర్, చిరంజీవి విశ్వంభర సినిమాలు విడుదలకు సిద్దంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆ సినిమాలు క్రిస్మస్, న్యూఇయర్, సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతున్నాయి.