దేవరలో హైలెట్ సీన్స్ ఇవే, ఊహకు అందని లుక్, థియేటర్ షేక్ అంతే

“ఒక్కో సీను ఒక్కో షాటు మైండ్ పోతుంది లోపల” ఈ డైలాగ్ వినే ఉంటారుగా. ఎస్ ఇప్పుడు దేవర దెబ్బకు సినిమా చూసేవాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది అంటున్నారు సినిమా జనాలు. సరిగా 5 రోజులు ఉంది దేవర రిలీజ్ కి. ఈ 5 రోజులు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం ఎన్టీఆర్ కు కూడా సాధ్యం కాని పరిస్థితి.

  • Written By:
  • Publish Date - September 22, 2024 / 02:34 PM IST

“ఒక్కో సీను ఒక్కో షాటు మైండ్ పోతుంది లోపల” ఈ డైలాగ్ వినే ఉంటారుగా. ఎస్ ఇప్పుడు దేవర దెబ్బకు సినిమా చూసేవాళ్ల పరిస్థితి అలాగే ఉంటుంది అంటున్నారు సినిమా జనాలు. సరిగా 5 రోజులు ఉంది దేవర రిలీజ్ కి. ఈ 5 రోజులు ఫ్యాన్స్ ని కంట్రోల్ చేయడం ఎన్టీఆర్ కు కూడా సాధ్యం కాని పరిస్థితి. ఇక సోషల్ మీడియాలో వస్తున్న వార్తలు సినిమాపై హైప్ ఓ రేంజ్ లో పెంచుతున్నాయి. సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ జరుగుతున్న ప్రీ రిలీజ్ మార్కెట్ కూడా బొమ్మ హిట్టు అనే నమ్మకాన్ని పెంచేస్తుంది.

ముందు ముంబైలో రిలీజ్ చేసిన ట్రైలర్ తో నెగటివ్ టాక్ వచ్చింది గాని… సినిమా విడుదల దగ్గర పడుతున్న కొద్దీ అది తగ్గుతూ వస్తోంది. ఇక ఇప్పుడు ఓ పోస్ట్ విచ్చలవిడిగా వైరల్ అవుతోంది. ఈ సినిమాలో హైలెట్ అయ్యే సీన్స్ ఏంటీ అనేది ఆ పోస్ట్. అసలు ఏం ఏం వైరల్ అవుతాయో ఒకసారి చూద్దాం. కుస్తీ ఫైట్ సీన్ ఈ సినిమాలో దుమ్ము రేపడం ఖాయం అంటున్నారు జనాలు. అలాగే అండర్ వాటర్ సీక్వెన్స్ కూడా సినిమాకు హైలెట్ అయ్యే ఛాన్స్ ఉంది. అలాగే హాఫ్ మూన్ సి ఫైట్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించడం ఖాయం అంటున్నారు.

ఆ తర్వాత ఆయుధ పూజ పాట కూడా సినిమాలో బ్లాక్ బస్టర్ అవుతోంది అని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. వీటన్నిటికంటే సినిమాలో ఎన్టీఆర్ కొత్త లుక్ లో కనపడే అవకాశం ఉందట. ఆ లుక్ అసలు ఇప్పటి వరకు ఎక్కడా బయట పెట్టలేదు చిత్ర యూనిట్. చుట్టమల్లె సాంగ్ లో ఎన్టీఆర్ డాన్స్ కూడా రివీల్ చేయలేదట. అది కూడా హైలెట్ అవుతోంది అంటున్నారు జనాలు. ఇక ఫియర్ సాంగ్ కూడా సినిమాలో పక్కా నచ్చుతోంది అని నమ్ముతున్నారు. ఇలా దేవరలో ఒక్కో సీను ఒక్కో సంచలనం అని నమ్ముతున్నారు.