నా ముఖం బాలేదన్నారు, చైతునే నాకు కావాలనుకున్నా, పెళ్లి చేసుకున్నా

అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టిన శోభిత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటి వరకు శోభిత ధూళిపాళ్ళ... ఇప్పుడు అక్కినేని శోభితగా మారిపోయింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఎట్టకేలకు వివాహం చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు.

  • Written By:
  • Publish Date - December 10, 2024 / 03:28 PM IST

అక్కినేని ఫ్యామిలీలో కోడలిగా అడుగుపెట్టిన శోభిత ఇప్పుడు ఫుల్ జోష్ లో ఉంది. ఇప్పటి వరకు శోభిత ధూళిపాళ్ళ… ఇప్పుడు అక్కినేని శోభితగా మారిపోయింది. ఎప్పటి నుంచో ప్రేమలో ఉన్న ఈ ఇద్దరు ఎట్టకేలకు వివాహం చేసుకుని న్యూ లైఫ్ స్టార్ట్ చేస్తున్నారు. నాగ చైతన్య… సమంతా నుంచి డైవర్స్ తీసుకున్న తర్వాత శోభితకు దగ్గరయ్యాడు. ఆ విషయం బయటకు లీక్ అయినా మీడియాకు ఎక్కువ ఫీడ్ ఇవ్వడం తగ్గించారు. ఇద్దరి నిశ్చితార్ధం సమయంలోనే జనాలకు క్లారిటీ వచ్చింది. చివరికి ఇద్దరూ పెళ్లి చేసేసుకున్నారు.

ఇక తాను ప్రేమించిన వాడిని పెళ్లి చేసుకున్నా అనే సంతోషం శోభితలో ఎక్కువగా ఉంది. తను కలలు కన్న హస్బెండ్ చైతూ అంటూ ఆమె పొంగిపోతుంది. ఎప్పటి నుంచో ఎదురు చూసిన ప్రేమ చైతూ రూపంలో తనకు దక్కిందని ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టింది. రీసెంట్ గా వివాహ బంధంలోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు… తన ఫ్యాషన్, తన ఫ్యూచర్ ప్లాన్స్ వంటి విషయాలు అలాగే తన భర్త నాగచైతన్య గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంది. చైతన్య లాంటి వ్యక్తి భర్తగా రావడం ఎంతో అదృష్టం అని ఆమె ఎమోషనల్ అయింది.

సింప్లిసిటీ, మంచి మనసు, దయ, ఇతరుల పట్ల మర్యాదగా ఉంటూ, హుందాగా ప్రవర్తించే చైతూ లక్షణాలు నన్ను ఎంతగానో ఆకట్టుకున్నాయని శోభిత చెప్పుకొచ్చింది. చైతు తనను ఎంతగానో ప్రేమిస్తాడని… చాలా బాగా చూసుకుంటాడు అంటూ తన భర్తను ఆకాశానికి ఎత్తేసింది శోభిత. ఇక నటిగా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన తొలినాళ్లలో తనకు ఎన్నో అవమానాలు కూడా ఎదుర్కొన్నా అంటూ శోభిత చెప్పుకొచ్చింది. అందంగా లేనని, ఆకర్షణీయంగా కనిపించనని నా ముఖం మీదే చెప్పేవారని ఫీల్ అయిపోయింది.

ఓ ప్రముఖ కంపెనీ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్స్‌ కు వెళితే బ్యాక్‌ గ్రౌండ్‌ మోడల్‌ గా కూడా పనికిరానని చెప్పడం నన్ను ఎంతో కుమిలిపోయెలా చేసింది అంటూ ఎమోషనల్ అయింది. కాని పట్టుదలతో, ఆత్మవిశ్వాసంతో ప్రయత్నించి కొన్నాళ్ల తర్వాత అదే కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌ అయ్యానని చెప్పుకొచ్చింది శోభిత. నాకు ఏదైన కథ పాత్ర నచ్చితేనే అంగీకరిస్తాను అంటూ క్లారిటీ ఇచ్చింది. ఎప్పుడూ తెరపై కనిపించాలనే కోరిక నాకు లేదని… అభిరుచికి తగ్గ పాత్రలే చేస్తానని చెప్పింది శోభిత. ఇక రీసెంట్ గా తన పెళ్లి ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది శోభిత. ‘మాంగల్యం తంతునానేనా మమజీవన హేతునా కంఠే భద్నామి సుభగే త్వం జీవ శరదాం శతం’ అంటూ చైతన్యతో జరిగిన వివాహ వేడుక ఫోటోలను ఆమె షేర్ చేసింది. ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.