సౌత్ ఇండియా సినిమా దమ్ము మరోసారి ప్రూవ్ చేసిన సినిమా అమరన్. ఏ మాత్రం అంచనాలు లేకుండా వచ్చి… సోషల్ మీడియా, మౌత్ ప్రమోషన్స్ తో 300 కోట్ల రూపాయల వసూళ్లు సాధించి తొడ కొట్టింది. శివ కార్తికేయన్ కు తొలి 300 కోట్ల సినిమా ఇదే. ఈ సినిమాలో దర్శకుడి టాలెంట్ కు శివ కార్తికేయన్ నటన ప్లస్ కావడంతో సినిమా సూపర్ హిట్ అయింది. ఆర్మీ అధికారుల జీవితాలను సిల్వర్ స్క్రీన్ పై చూపించడం అంటే చాలెంజ్ తో కూడుకున్న వ్యవహారం. కథ ఎంత బాగా రాసుకున్నా స్క్రీన్ ప్లే కింగ్ రోల్ ప్లే చేస్తుంది.
ఈ విషయంలో డైరెక్టర్ హీరో అనిపించుకున్నాడు. రాజ్ కుమార్ పెరియసామి టేకింగ్ కు స్టార్ డైరెక్టర్లు కూడా ఫిదా అయ్యారు. ఇక సాయి పల్లవి నటన ఈ సినిమాలో హైలెట్. గ్లామర్ రోల్స్ డామినేషన్ చేస్తున్న ఈ రోజుల్లో సాయి పల్లవి చాలా కాన్ఫిడెంట్ గా నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలు తీసుకుని ప్రాణం పెడుతుంది అనే విషయం మరోసారి ప్రూవ్ అయింది. ఇందు రేబెకా వర్గీస్ పాత్రలో ఆమె ఒదిగిపోయిన విధానం చూసి తమిళ జనాలతో పాటు సినిమా పిచ్చోళ్ళు కూడా ఫిదా అయిపోయారు. మానసిక సంఘర్షణ పడే సీన్స్ లో ఆమె నటనకు వందకు వెయ్యి మార్కులు పడ్డాయి.
ఇక క్లైమాక్స్ లో అయితే ప్రేక్షకులతో కన్నీళ్లు పెట్టించింది సాయి పల్లవి. ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకునే రోల్ లో.. జీవించింది ఆమె. ఈ సినిమాతో ప్రొడ్యూసర్ గా కమల్ హాసన్ కెరీర్ లోనే భారీ హిట్ గా నిలిచింది. ఆయన అప్పులు అన్నీ అమరన్ తీర్చేసాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ కూడా చూస్తున్నాం. సినిమాలో సాంగ్స్, బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కొన్ని డైలాగ్స్ ఆడియన్స్ తో క్లాప్స్ కొట్టించాయి అనే చెప్పాలి. ఇదిలా ఉంచితే ఇప్పుడు ఈ సినిమా మేకర్స్ కు ఓ షాక్ తగిలింది. ఓ స్టూడెంట్ షాక్ ఇచ్చాడు.
వీవీ వాగీసన్ అనే స్టూడెంట్… సినిమా మేకర్స్ కు పంపిన నోటీసులు తమిళ మీడియాలో, సినిమా సర్కిల్స్ లో సంచలనం అయ్యాయి. చెన్నైలో ఇంజనీరింగ్ చదువుతున్న ఆ స్టూడెంట్ నెంబర్ ను అతని అనుమతి లేకుండా సినిమాలో వాడేసారు. అతని నెంబర్ ను స్క్రీన్ పై చూపించడంతో తనకు కోటి పది లక్షలు కట్టాలని డిమాండ్ చేస్తూ నోటీసులు పంపించాడు. దీనితో నిర్మాతలు షాక్ అయ్యారు. దీనిపై ఓ రేంజ్ లో మీమ్స్ వైరల్ అవుతున్నాయి. లాభాల్లో నాకు వాటా ఇవ్వాల్సిందే అన్ని పట్టుబట్టాడు అంటూ ట్రోల్ చేస్తున్నారు.