కేజిఎఫ్ అమ్మ మొగుడు, ఎన్టీఆర్ నీల్ స్టోరీ బ్యాక్ డ్రాప్ ఇదే…

కేజిఎఫ్ సినిమా ఇండియన్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా సినిమాను కాస్త భిన్నంగా చూపించడం మొదలుపెట్టాడు ప్రశాంత్. ఇప్పుడు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. సలార్ సినిమాకు అదే కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే.

  • Written By:
  • Publish Date - October 2, 2024 / 01:38 PM IST

కేజిఎఫ్ సినిమా ఇండియన్ సినిమాకు ఓ ట్రెండ్ సెట్ చేసింది. గతంలో ఎన్నడు లేని విధంగా సినిమాను కాస్త భిన్నంగా చూపించడం మొదలుపెట్టాడు ప్రశాంత్. ఇప్పుడు అదే ట్రెండ్ కంటిన్యూ అవుతోంది. సలార్ సినిమాకు అదే కంటిన్యూ అయిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాకు కూడా అదే రేంజ్ లో ప్లాన్ చేస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఒక కేజీ బొగ్గు ఉంటే చాలు మసీ చేసి అందరికి రాసేస్తా అంటున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా షూట్ ని గ్రాండ్ గా ప్లాన్ చేసుకుంటున్నాడు ప్రశాంత్ నీల్.

ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కావడం కష్టమే. రెండేళ్ళు ఆగాల్సిందే అనే సంకేతాలు ఇప్పటికే వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా బ్యాక్ డ్రాప్ ఏ రేంజ్ లో ఉంటుందో అని అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా బ్యాక్ డ్రాప్ తెలిస్తే కళ్ళు భైర్లు కమ్మాల్సిందే. బంగ్లాదేశ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండనుంది. అక్కడ ఉన్న తెలుగు వారి కోసం ఎన్టీఆర్ పోరాటం చేస్తాడు. అక్కడ ఉన్న ప్రభుత్వంతో కొన్ని ఉగ్రవాద మూకలతో ఎన్టీఆర్ పోరాటం చేస్తాడట. దీని కోసం ఓ పారిశ్రామిక వాడలో భారీ సెట్ ఏర్పాటు చేస్తున్నారట.

ఈ సినిమాలో ఎవరూ ఊహించని ట్విస్ట్ లు కూడా ఉంటాయని టాక్. సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఈ సినిమా షూటింగ్ మొత్తం ఓడిసాలో లేదా పశ్చిమ బెంగాల్ లో జరుగుతుంది అంటున్నాయి సినీ వర్గాలు. కచ్చితంగా ఈ బ్యాక్ డ్రాప్ ఓ ట్రెండ్ సెట్ చేస్తుందని ఎన్టీఆర్ ఫ్యాన్స్ ధీమాగా ఉన్నారు. ఇక ఈ సినిమా షూటింగ్ కాస్త ఆలస్యం అయ్యే సూచనలు కనపడుతున్నాయి. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమా మీద ఎక్కువ దృష్టి పెట్టాడట. వచ్చే నెల చివరి నుంచి ఈ సినిమా షూట్ లో పాల్గొంటాడు అని టాక్.