ఏదేమైనా సినిమా పరిశ్రమలో మంచి ఫ్యామిలీ కచ్చితంగా డిఫరెంట్. వాళ్లు మాట్లాడే మాటలు వాళ్ళు చేసే సినిమాలు అన్నీ కాస్త డిఫరెంట్ గానే ఉంటాయి. ఇక మంచి ఫ్యామిలీలో మంచి లక్ష్మిది టూ మచ్ డిఫరెంట్. ఆమె వ్యవహార శైలి ఆమె ఏం చేస్తుందో ఎక్కడుంటుందో ఎవరికీ తెలియదు. అప్పుడప్పుడు టీవీ షోలలో మెరుస్తూ ఉంటుంది. కొన్నాళ్ళు అమెరికాలో ఉంటుంది, హైదరాబాదులో ఉంటుంది. కొన్నాళ్ళు యూరప్ వెళ్తుంది. ఇలా మంచు లక్ష్మి లైఫ్ ని అన్ని రకాలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది.
అయితే తన భర్తతో మాత్రం కనపడిన సందర్భాలు చాలా తక్కువ. మొదటి భర్తతో విడాకులు తీసుకున్న తర్వాత రెండో వివాహం చేసుకున్న మంచు లక్ష్మి తన భర్తతో కలిసి ఉండటం లేదు అనే ప్రచారం ఎప్పటి నుంచొ జరుగుతుంది. సోషల్ మీడియాలో కూడా దీనికి పై ఎన్నో రూమర్స్ వస్తూ ఉంటాయి. అయితే ఆమె తన భర్తతో విడాకులు తీసుకుంటుంది అనే ప్రచారం ఎప్పటినుంచో జరుగుతోంది. అయితే తాను మాత్రం అదేమీ నిజం కాదని చెప్పే ప్రయత్నం చాలా సార్లు చేసింది. తాజాగా కూడా దీనికి సంబంధించి ఆమె ఓ క్లారిటీ ఇచ్చింది.
తన భర్తకు అసలు తాను ఎందుకు దూరంగా ఉంటాను అనే టాపిక్ కు సంబంధించి ఆమె కొన్ని కామెంట్స్ చేసింది. తన తండ్రిని అలాగే తన సోదరులను విడిచిపెట్టడం ఇష్టం లేక మంచు లక్ష్మి తన పుట్టింట్లోనే ఎక్కువగా ఉంటుందట. దీనిపై మాట్లాడిన లక్ష్మి అందరూ ఆడవాళ్లు లాగా తాను పెళ్లయిన తర్వాత అత్తగారింటికి వెళ్ళాలి అంటే నచ్చదని… అందుకే తన నాన్నగారి ఇంట్లో ఉంటాను అంటూ క్లారిటీ ఇచ్చింది. తాను అందరిలా కాదని ఎవరికోసమో తాను ఏదీ చేయనని తనకు నచ్చినట్లు ఉంటాను అంటూ క్లియర్ కట్ గా చెప్పింది.
తనకు చిన్న కుటుంబంలో ఉండడం చాలా ఇష్టం అని కరోనా టైం లో తనకు ఎన్నో అనుభవాలు ఎదురయ్యాయని… రేపు ఉంటామా పోతామో తెలియనప్పుడు అందరూ కలిసి ఉండాలి. అందుకే ఇక్కడ ఉంటాను అని చెప్పింది. తన మనశ్శాంతి కోసం తన భర్త. తన భర్త మనశాంతి కోసం తాను నచ్చిన చోట ఉంటామని మేము తరచూ కలుస్తూ ఉంటామని… ఆయన అమెరికాలో ఉన్నా నేను హైదరాబాదులో ఉన్నా సరే కలుస్తామని మొత్తంగా మనశ్శాంతి ఎక్కడ దొరికితే అక్కడ ఉంటాము అంటూ ఆమె ఆన్సర్ చెప్పింది. మంచి ఫ్యామిలీలో ఈ మధ్య ఆస్తు తగాదాలు కాస్త సెన్సేషన్ అయ్యాయి. ఈ తగాదాల్లో ఆమె ఎవరి వైపు ఉంది అనేది క్లారిటీ లేదు. అయితే సోషల్ మీడియాలో వచ్చిన రూమర్స్ ప్రకారం ఆమె మంచు మనోజ్ కు సపోర్ట్ చేస్తోంది అనే క్లారిటీ చాలామందికి వచ్చింది.