టాలీవుడ్‌లో ఈ సంక్రాంతి పోరు ఆసక్తికరంగా మారింది. పండుగ బరిలో అగ్ర హీరోలు మహేష్‌బాబు, నాగార్జున, వెంకటేష్, రవితేజతో పాటు యంగ్ హీరో తేజా సజ్జా నిలిచారు. ఈ స్టార్స్ సినిమాలే కాకుండా డబ్బింగ్ మూవీస్ తో శివకార్తికేయన్, ధనుష్ కూడా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో పోటీ రసవత్తరంగా మారింది. సంక్రాంతికి రిలీజ్ అవుతోన్న సినిమాల్లో మహేష్ బాబు గుంటూరు కారం ఆడియెన్స్‌లో అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 12న థియేటర్లలో రిలీజ్ అవుతోంది.
గుంటూరు కారం తర్వాత వెంకటేష్ సైంధవ్ సంక్రాంతి సినిమాల్లో బడ్జెట్ పరంగా సెకండ్ ప్లేస్‌లో ఉంది. దాదాపు 80 నుంచి 100 కోట్ల బడ్జెట్‌తో వెంకటేష్ కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్ మూవీగా సైంధవ్ రూపొందుతోంది. యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ మూవీకి హిట్ ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వం వహిస్తోన్నాడు. సైంధవ్‌తోనే వెంకటేష్ పాన్ ఇండియన్ మార్కెట్‌లోకి ఎంట్రీ ఇస్తున్నాడు. దీంతో వెంకటేష్‌కు సైంధవ్ సక్సెస్ కీలకంగా మారింది. స్టార్ హీరోలకు పోటీగా సంక్రాంతి బరిలో హనుమాన్ నిలవడం టాలీవుడ్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. తేజా సజ్జా హీరోగా నటిస్తోన్న హనుమాన్ మూవీకి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహిస్తోన్నాడు. సూపర్ హీరో కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ మూవీ బడ్జెట్ 80 కోట్లకుపైనే అని సమాచారం. హనుమాన్ కూడా పాన్ ఇండియన్ లెవెల్‌లో విడుదలవుతోంది.
ఈ సంక్రాంతికి నాగార్జున నా సామిరంగం, రవితేజ ఈగల్ కూడా థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. ఇక ఈ సినిమాలకు తోడు.. ధనుష్ కెప్టెన్ మిల్లర్, శివకార్తికేయన్ అయాలన్, విజయ్ సేతుపతి మేరీ క్రిస్మస్ సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి. ఎంతలేదన్నా.. ఎన్నో కొన్ని థియేటర్లను, షోలను దక్కించుకుంటారు. దీంతో ఈ సినిమాలన్నీ.. మహేష్ గుంటూరోడికి పోటీ కానున్నాయనే టాక్ అయితే నెట్టింట వస్తోంది. కానీ ఈ సారి బాక్సాఫీస్ పోరు మాత్రం గట్టిగానే జరగనుందనే కామెంట్ కూడా వస్తోంది. ఎవరికి వారే తగ్గేదేలే అంటూ ప్రమోషన్స్ తో కాంపిటీషన్ పెంచుతున్నారు. మొత్తం ఈ సంక్రాంతికి ఏడు సినిమాలు తెలుగు ప్రేక్షకులకు వినోదాన్ని పంచేందుకు సిద్ధమయ్యాయి. ఈ సంక్రాంతి పోరులో విన్నర్ ఎవరన్నది ఆసక్తికరంగా మారింది.