SALAAR: ఒక సినిమా.. మూడు ట్రైలర్లు.. సలార్ సర్‌ప్రైజ్ ఇదే..!

ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ టీం మొదటి ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతోంది. ఆల్రెడీ సలార్ క్లైమాక్స్ తాలూకు ప్యాచ్ వర్క్ ప్రభాస్ లేకుండానే పూర్తి చేసింది సినిమా టీం. ఇక గ్రాఫిక్స్‌కి రిపేర్లు పూర్తై ఫస్ట్ కాపీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో రావొచ్చని తెలుస్తోంది.

  • Written By:
  • Publish Date - October 2, 2023 / 05:45 PM IST

SALAAR: సలార్ మూవీ డిసెంబర్ 22న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కాబోతోంది. ఐతే ఈలోపు మూడు సర్ ప్రైజ్‌లను రెడీ చేసింది ఫిల్మ్ టీం. ఒక్క సినిమా మూడు ట్రైలర్లు.. ఇది ప్రశాంత్ నీల్ కొత్త ప్రమోషన్ స్ట్రాటజీ. ఈనెల 23న ప్రభాస్ బర్త్ డే సందర్భంగా సలార్ టీం మొదటి ట్రైలర్‌ని రిలీజ్ చేయబోతోంది. ఆల్రెడీ సలార్ క్లైమాక్స్ తాలూకు ప్యాచ్ వర్క్ ప్రభాస్ లేకుండానే పూర్తి చేసింది సినిమా టీం. ఇక గ్రాఫిక్స్‌కి రిపేర్లు పూర్తై ఫస్ట్ కాపీ నవంబర్ ఫస్ట్ వీక్‌లో రావొచ్చని తెలుస్తోంది. సో.. ఆ తర్వాత డిసెంబర్ 22 వరకు ప్రమోషన్ పనుల్లోనే టీం ఉంటుంది.

అలాగని అప్పటి వరకు వెయిట్ చేయకుండా సలార్ తాలూకు హైప్ క్రియేట్ చేసేందుకు ముచ్చటగా మూడు ట్రైలర్ల ఫార్ములా అప్లై చేయనున్నాడు ప్రశాంత్ నీల్. ఈనెల 23న రెబల్ స్టార్ బర్త్ డే సందర్భంగా ఒక ట్రైలర్, దీపావళికి మరో ట్రైలర్ అంటే నవంబర్ 10న రెండో ట్రైలర్ వస్తుంది. ఇక డిసెంబర్ 15న స్పెషల్ ఈవెంట్ ప్లాన్ చేసి మూడో ట్రైలర్‌ని, పాటని రిలీజ్ చేయబోతున్నారట. ఈ మ్యాటర్ ఈవెంట్ మేనెజర్ల పుణ్యమాని లీకైంది. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్‌లో పూనకాలు వచ్చే పరిస్థితుంది. ఈ చిత్రం షారుక్ నటించిన డంకీ మూవీతో పోటీ పడాల్సి ఉంది.