పాపులర్ తెలుగు షో బిగ్ బాస్ సీజన్ 7 చివరి దశకు చేరుకుంది. ముగింపుకు వచ్చే కొద్దీ షోను మరింత రక్తికట్టిస్తున్నారు మేకర్స్. అందుకు తగ్గట్టే హౌస్ మేట్స్ కూడా తమ గేమ్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుంటున్నారు. ప్రస్తుతం ఎనిమిది మంది హౌస్ మేట్స్ తో ఉన్న ఈ సీజన్.. త్వరలోనే టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ ఎవరో డిసైడ్ చేయనుంది. కాగా ఫినాలే దగ్గర పడుతూ ఉండడంతో హౌస్ మేట్స్ కూడా ఆటని చాలా జాగ్రత్తగా ఆడుతున్నారు. హౌస్ లో రసవత్తరంగా జరుగుతున్న టికెట్టు ఫినాలే టాస్కులో అదరగొడుతున్నాడు పోటీపడుతున్నారు.
కొన్ని రోజులుగా బిగ్ బాస్ లో టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతోంది. ఈ పోటీ లో అమర్ ఎక్కువ పాయింట్లతో లీడ్ లో నిలిచాడు. ఇక పోటీలు గౌతమ్, ప్రశాంత్ , అర్జున్, అమర్ లు ఉండగా.. గౌతమ్ ఔట్ అయ్యాడు. అయితే తన పాయింట్లను అమర్ కు ఇచ్చాడు. ఆ తర్వాత ప్రియాంక వల్లనే అమర్ కు పాయింట్లు ఇచ్చానని గౌతమ్ చెప్పాడు. ఆ తర్వాత అందరూ సరదాగా ముచ్చట్లు చెప్పుకున్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ అందరికి టీ ఇచ్చి.. హౌస్ ఉన్న ప్రతి ఒక్కరిని వారి లవ్ స్టోరీలు చెప్పమని అడిగాడు. శివాజీ తన భార్యకి తనకి మధ్య జరిగిన ప్రేమ కథ చెప్పాడు. శోభా శెట్టి తన ప్రేమ కథ ను చెప్పడంతో పాటు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నట్లు చెబుతూ తెగ సిగ్గుపడిపోయింది. తర్వాత అమర్, అర్జున్ లు తమ లవ్ మ్యాటర్ చెప్పారు.
ఇంటి సభ్యులు సరదాగా గడుపుతున్న టైంలో బిగ్ బాస్ అర్జున్, అమర్, ప్రశాంత్ మధ్య టాస్క్ జరిగింది. ముగ్గురూ ఒక తాడు మధ్యలో ఉంటారు. బలంగా లాక్కుని వెళ్లి వారి బుట్టలో జెండాలు వేయాలి. అర్జున్ ఎక్కువ బలం ఉపయోగించడంతో అతడి ముందు అమర్, ప్రశాంత్ తేలిపోయారు. ఈ టాస్క్ లో అర్జున్ విజయం సాధించగా.. అమర్ దీప్ సెకండ్ ప్లేస్ లో నిలిచారు. ప్రశాంత్ చివరి స్థానంతో సరిపెట్టుకున్నారు. తక్కువ పాయింట్స్ ఉండడంతో టికెట్ ఫినాలే అస్త్ర రేస్ నుంచి ప్రశాంత్ తప్పుకోవాల్సి వచ్చింది. టికెట్ ఫినాలే అస్త్ర ఫైనల్ కంటెండర్స్ గా అమర్, అర్జున్ నిలిచారు. దీంతో ఈ ఇద్దరికి బిగ్ బాస్ టాస్క్ పెట్టాడు. ఫైనల్ టాస్క్ పాముతో చెలగాటం అన్న గేమ్ ను పెట్టాడు. రెండు పాము కటౌట్స్ పెట్టడంతో పాటు పాము నోట్లోకి బాల్స్ వేయాలని సూచించాడు. ఎవరు ఎక్కువ బాల్స్ వేస్తే వారే విజేత అని ప్రకటించాడు బిగ్ బాస్. ఈ టాస్క్ లో అర్జున్ ఎక్కువ బంతులని పాము నోట్లో వేసి విజేతగా నిలిచాడు. టికెట్ ఫినాలే అస్త్ర ను సాధించిన మొదటి ఇంటి సభ్యుడిగా నిలిచాడు. మొత్తానికి ఫినాల్ కోసం జరిగిన టాస్క్ లను ఆడియెన్స్ తెగ ఎంజాయ్ చేశారు.