Tillu Square: టిల్లూ స్క్వేర్ ఎలా ఉంది..? మినీ రివ్యూ..

టీజర్, ట్రైలర్ చూసిన జనం ఇక పండగే అనుకున్నారు. సాంగ్స్ కూడా మత్తెక్కించాయి. ఇక హిట్ కన్పామ్ అన్నారు. కాకపోతే కథలో కామెడీ ఎక్కువైంది. కంటెంట్ తక్కువైందనే కామెంట్స్ మాత్రం వినిపిస్తోంది.

  • Written By:
  • Updated On - March 29, 2024 / 05:26 PM IST

Tillu Square: డీజే టిల్లూ సీక్వెల్‌గా సిద్దూ చేసిన ప్రయోగం టిల్లూ స్క్వేర్. ఇందులో రాధిక లేని బాధని తీర్చేందుకు అనుపమ పరమేశ్వరన్ వచ్చింది. ఈ కాంబినేషన్‌లో సినిమా అనగానే టీజర్, ట్రైలర్ చూసిన జనం ఇక పండగే అనుకున్నారు. సాంగ్స్ కూడా మత్తెక్కించాయి. ఇక హిట్ కన్పామ్ అన్నారు. కాకపోతే కథలో కామెడీ ఎక్కువైంది. కంటెంట్ తక్కువైందనే కామెంట్స్ మాత్రం వినిపిస్తోంది. కథ విషయానికొస్తే ఫస్ట్ పార్ట్‌లో రాధికి ఎఫెక్ట్ తో టిల్లూ ఈవెంట్స్ నడుపుకంటున్న హీరోకి అనుకోకుండా హీరోయిన్ కలవటం, తనతో ఓ రాత్రి దగ్గరైపోవటం, కొన్నిరోజులకు హీరోయిన్ తాను ప్రెగ్నెంట్ అని బాంబు పేల్వటం జరిగిపోతుంది.

Vishwambhara: 30 ఏళ్ల త‌ర్వాత చిరు-కీరవాణి కాంబో.. సంగీతం ఎలా ఉండబోతుందంటే.

కట్ చేస్తే హీరోయిన్ తానున్న చోటకు రమ్మనటం, హీరో వెల్లాకే డీజే టిల్లూలో ఎక్కడికైతే రాధిక రమ్మందో అక్కడికే ఇప్పుడు తను చేరుకోవటం, తర్వాత హీరోయిన్‌లో స్పై షేడ్స్ షాక్ ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇంటర్నేషనల్ డాన్ వైపుకి కథ షిప్ట్ అవుతుంది.. ఇంతకి హీరోకి హీరోయిన్ ఎందుకు లింకైంది. తర్వాత వాళ్ల జర్నీ ఎందుకు ఇంటర్నేషనల్ క్రైమ్ వైపు వెళ్లిందో అదే అసలు కథ. సిద్దూ ఎప్పటి లానే తన డైలాగ్ డెలివరితో, తన పాత్రతో సినిమాని వన్ మ్యాన్ షోగా మార్చాడు. వన్ లైన్ కామెడీ జోక్స్ పేల్చి, కథ తక్కువగా ఉన్న ఫీలింగ్ని కవర్ చేయగలిగాడు. విచిత్రం ఏంటంటే అనుపమ పరమేశ్వరన్.. వచ్చీ రాగానే ముద్దుతో మత్తెక్కించి బోల్డ్ సీన్ లో క్లీన్ బోల్డ్ చేసింది. తర్వాత మాత్రం తనకి, హీరోకి మధ్య కెమిస్ట్రీ లేదు, బయోలాజీ వర్కవుట్ కాలేదు. హీరో తండ్రి పాత్ర జోకులు, సిద్దూ జోకులు, ఇక తన చుట్టు పరిస్థితులకు హీరో రియాక్ట్ అవ్వటం వల్ల వచ్చే జోకులు.. ఇవి తప్ప టిల్లూ స్క్వేర్ లో చెప్పుకోడానికి కొత్తగా ఏంలేదు.

ఓ స్పై, ఒక ఇంటర్నేషనల్ క్రిమినల్, ఇలా అనవసరంగా హీరోయిన్ మిషన్ అంటూ రాంగ్ రూట్లో కథ వెల్లిందనే డిసప్పాయింట్ మెంటే ఆడియన్స్ లో పెరిగిపోతోంది. ఒక్క ఇంటర్నేషనల్ డాన్ అన్న కాన్సెప్ట్ పక్కన పెడితే, టిల్లూ స్క్వేర్ కూడా డీజే టిల్లూ కథనే మరో వర్షన్ లో చెప్పినట్టు అనిపిస్తోందంటున్నారు. సో కథ, కథనం పర్లేదనిపించుకుంటే, సినిమాటోగ్రపి, ఎడిటింగ్, మ్యూజిక్ మాత్రం బానే ప్లస్ అయ్యాయి. ఎటొచ్చి తక్కువ డ్యూరేషన్ తో సినిమా తీసినా, సాగతీత అన్న ఫీలింగ్ ని మాత్రం ఫిల్మ్ టీం కవర్ చేయలేకపోయింది. కాకపోతే సిద్దూ పాత్ర, తన పెర్పామెన్స్, వన్ లైనర్ జోక్స్ మాత్రం బీభత్సంగా పేలటంతో, మంచి టైంపాస్ మూవీగా మాత్రం మంచి మార్కులే పడుతున్నాయి.